జగన్ అడిగారు.. కేసీఆర్ ఓకే అన్నారు. కానీ కేంద్రం మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అలాగని రెడ్ సిగ్నల్ వేయట్లేదు… మరి ఎంతకాలం ఈ ఎల్లో సిగ్నల్..? అమరావతికి, హైదరాబాద్ కి ఓకే అయినప్పుడు ఢిల్లీకేంటి అభ్యంతరం?
స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి, ఒకరు ఐఏఎస్, ఒకరు ఐపీఎస్… వీరిద్దరిని ఇంటర్ క్యాడర్ డిప్యుటేషన్ కింద ఏపీకి తేలవాలనుకున్నారు జగన్. అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్ట్ కి ఏపీ సీఎం జగన్ స్టీఫెన్ రవీంద్రను సెలెక్ట్ చేసుకున్నారు. అందుకు స్టీఫెన్ కూడా ఓకే అన్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతా ఓకే అయిపోయింది.. కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది అనుకుంటున్న సమయంలో వీరిద్దరి అంగీకారాన్ని ఫార్మాలిటీగా ఓకే చెప్పాల్సిన కేంద్రం ఎటూ తేల్చడంలేదు.
స్టీఫెన్ సంగతి సరే.. శ్రీలక్ష్మిని కూడా పెండింగ్ లో పెట్టడంతో విజయసాయిరెడ్డి శ్రీలక్ష్మిని తీసుకొని అమిత్ షాని కలిశారట. అయితే అసలు సమస్య అంతా స్టీఫెన్ చుట్టూనే ఉందని రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. ప్రత్యేక కారణం లేకుండా కేంద్రం ఎందుకు పెండింగ్ పెడుతుందని గుసగుసలూ.. వినిపిస్తున్నాయి. అయితే శ్రీలక్ష్మికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే ముందు స్టీఫెన్ సంగతి తేలాలి. ఇంకో వైపు ఇప్పటికే ఆలస్యమైపోయింది… ఇంకెన్నాళ్లు ఈ ఎల్లో సిగ్నల్ అనుకుంటోంది ఏపీ ప్రభుత్వం. ఇంతకీ కేంద్రం ఇద్దరికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా.. స్టీఫెన్ ని హోల్డ్ లో పెడుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.