“చౌకీదార్ చోర్ హై”.. అంటూ రైళ్లలో కాంగ్రెస్ కార్యకర్తల పోస్టర్లు

| Edited By:

Mar 28, 2019 | 4:45 PM

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. “చౌకీదార్ చోర్ హై”.. అంటూ ఇండోర్ రైల్వే స్టేషన్లోని పలు రైళ్లలో నగరానికి  చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు అతికించారు. వీటిని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు రైళ్లలో పోస్టర్లను అతికించినట్లు పశ్చిమ రైల్వే సీనియర్ ప్రజా సంబంధాల అధికారి జితేంద్ర కుమార్ జయంత్ తెలిపారు. అహ్మదాబాద్ నుంచి ఇండోర్ నగరాల మధ్య నడిచే రైలులో కొందరు అభ్యంతకరమైన పోస్టర్లు అతికించారని […]

చౌకీదార్ చోర్ హై.. అంటూ రైళ్లలో కాంగ్రెస్ కార్యకర్తల పోస్టర్లు
Follow us on

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. “చౌకీదార్ చోర్ హై”.. అంటూ ఇండోర్ రైల్వే స్టేషన్లోని పలు రైళ్లలో నగరానికి  చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు అతికించారు. వీటిని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు రైళ్లలో పోస్టర్లను అతికించినట్లు పశ్చిమ రైల్వే సీనియర్ ప్రజా సంబంధాల అధికారి జితేంద్ర కుమార్ జయంత్ తెలిపారు. అహ్మదాబాద్ నుంచి ఇండోర్ నగరాల మధ్య నడిచే రైలులో కొందరు అభ్యంతకరమైన పోస్టర్లు అతికించారని పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే అధికారులు రైళ్లలో అతికించిన పోస్టర్లను వెంటనే తొలగించారు. రైల్వే చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఆ పోస్టర్లు అతికించింది తామేనని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి వివేక్ ఖండేల్ వాల్ అంగీకరించారు. ప్రధానమంత్రి దొంగ అనే విషయం ఎన్నికల సందర్భంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తాము “చౌకీదార్ చోర్ హై” అంటూ పోస్టర్లు అతికించామని వివేక్ పేర్కొన్నారు. మొత్తం మీద ఎన్నికల సందర్భంగా ఇండోర్ నగరంలో పోస్టర్ల వ్యవహారంపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.