Buddha Venkanna: ఆ ప్రధానికి పట్టిన గతే జగన్‌కు పడుతుంది.. సీరియస్ కామెంట్స్ చేసిన బుద్దా వెంకన్న

తెలుగు దేశం పార్టీ(TDP) మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న(Buddha Venkanna). టీడీపీ మహానాడుకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్న చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తాత..

Buddha Venkanna: ఆ ప్రధానికి పట్టిన గతే జగన్‌కు పడుతుంది.. సీరియస్ కామెంట్స్ చేసిన బుద్దా వెంకన్న
Buddha Venkanna

Updated on: May 16, 2022 | 4:51 PM

శ్రీలంక ప్రధానికి పట్టిన గతి ముఖ్యమంత్రి జగన్‌ కు(CM Jagan) పడుతుందని..ఐఏఎస్ అధికారులు సీఎంకు భయపడుతున్నారని విమర్శించారు తెలుగు దేశం పార్టీ(TDP) మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న(Buddha Venkanna). టీడీపీ మహానాడుకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్న చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తాత దిగొచ్చినా.. మహానాడును ఆపలేరని అన్నారు బుద్దా వెంకన్న. ఎక్కడైతే అడ్డుకుంటున్నారో అక్కడే పెట్టి తీరతామని స్పష్టం చేశారు. జగన్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని.. కలెక్టరుకు చెప్పి మహానాడుకు అనుమతులివ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మహానాడుకు అనుమతి ఇవ్వకుంటే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు బుద్దా వెంకన్న. తాము చేతులు ముడుచుకుని కూర్చోలేదని.. ఎల్లుండిలోగా అనుమతి ఇవ్వకుంటే ఆందోళనలు చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు బుద్దా వెంకన్న.

ఇదిలావుంటే.. టీడీపీ మహానాడును ఈ ఏడాది ఒంగోలులో నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న ఈ వేడుక కోసం న‌గ‌రంలోని ఒంగోలు మినీ స్టేడియాన్ని ఇవ్వాలని టీడీపీ కోర‌గా.. ప్ర‌భుత్వం అందుకు నిరాక‌రించింది. అవ‌స‌ర‌మైన ఫీజు చెల్లించ‌డంతో పాటుగా ముందుగానే సంప్ర‌దించినా కూడా అధికారులు స్టేడియాన్ని కేటాయించేందుకు స‌సేమిరా అన్నారు.

ఒంగోలు మినీ స్టేడియాన్ని మ‌హానాడుకు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం నిరాక‌రించ‌డంతో వేడుక‌ను ఒంగోలు స‌మీపంలోని మండ‌వారిపాలెంలో నిర్వ‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యించింది.

ఇవి కూడా చదవండి: AP: నీళ్లలో ఏవో తేలుకుంటూ వచ్చాయ్ అనుకోకండి.. అసలు విషయం తెలిస్తే కళ్లు తేలేస్తారు..

Telangana: బెట్టింగ్ వేసి ఉద్దరించినవాళ్లు ఎవరూ లేరు.. ఇతనిలా బలైపోయినవాళ్లు తప్ప

Loading...
Unable to load recommendations.
Follow Us