Gujarat New CM: గుజరాత్‌లో అనూహ్యంగా మారుతున్న రాజకీయ పరిణామాలు.. కొత్త సీఎం ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ..

|

Sep 12, 2021 | 1:09 PM

గుజరాత్‌లో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి  రాజీనామా చేసిన తర్వాత వేగంగా రాజకీయ మార్పులు మారుతున్నాయి.

Gujarat New CM: గుజరాత్‌లో అనూహ్యంగా మారుతున్న రాజకీయ పరిణామాలు.. కొత్త సీఎం ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ..
Bjp Cm
Follow us on

గుజరాత్‌లో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి  రాజీనామా చేసిన తర్వాత వేగంగా రాజకీయ మార్పులు మారుతున్నాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. కొత్త సీఎం నియామకంపై కమలనాథులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఈ మేరకు అంతర్గతంగా పలువురు కీలక నేతలు, కేంద్ర మంత్రులతో నాయకులు మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు గుజరాత్‌లో ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఓ నిర్ణయానికి మరికాసేపట్లో రానున్నారు.

అధిష్ఠానం తరఫున గుజరాత్‌ వ్యవహారాలను పరిశీలిస్తున్న కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, నరేంద్రసింగ్‌ తోమర్‌ ఇప్పటికే గాంధీనగర్‌ చేరుకున్నారు. ఈరోజు వారు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈరోజు ఉదయం వీరిద్దరితో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌.. గుజరాత్‌ పార్టీ అధ్యక్షుడు CR.పాటిల్‌తో ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సాయంత్రం 3 గంటలకు వీరు పార్టీ శాసనభ్యులతో మరోసారి సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది.

2016 ఆగస్టు 7న ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన విజయ్ రూపానీ విజయవంతంగా పాలన కొనసాగించారు. ఆయన గుజరాత్‌లోని రాజ్‌కోట్ వెస్ట్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Chirutha: అనుకున్నట్లుగానే చిక్కింది.. ఫారెస్ట్ అధికారుల ప్లాన్ ఫలించింది.. బోన్‌లో పడిన చిరుతను..

Biryani: బిర్యానీ తిన్నారు.. చికెట్ వంటకాలు లాగించారు.. ఇంటికి వెళ్లారు.. కట్ చేస్తే..