యోగీ ఇలాఖాలో పోటీకి దిగిన “రేసుగుర్రం” విలన్

ఉత్తరప్రదేశ్ : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలాఖా గోరఖ్‌పూర్‌లో లోక్‌సభ ఫైట్ రసవత్తరంగా మారింది. గతంలో తమకు కంచుకోటగా ఉన్న గోరఖ్‌పూర్‌లో రేసుగుర్రం విలన్ రవికిషన్‌ను బీజేపీ బరిలోకి దిపింది. ఉత్తర్ ప్రదేశ్‌ లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి మరో ఏడుగురి పేర్లను బీజేపీ హైకమాండ్ ఇవాళ ప్రకటించింది. అందులో రవి కిషన్‌తో పాటు గోరఖ్‌పూర్ సిట్టింగ్ ఎంపీ ప్రవీణ్ కుమార్ నిషాద్‌కు చోటుదక్కింది. ప్రవీణ్ ఈసారి సంత్ కబీర్‌నగర్ నుండి పోటీ చేయనున్నారు. యూపీ అసెంబ్లీ […]

యోగీ ఇలాఖాలో పోటీకి దిగిన రేసుగుర్రం విలన్

Edited By:

Updated on: Apr 15, 2019 | 7:52 PM

ఉత్తరప్రదేశ్ : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలాఖా గోరఖ్‌పూర్‌లో లోక్‌సభ ఫైట్ రసవత్తరంగా మారింది. గతంలో తమకు కంచుకోటగా ఉన్న గోరఖ్‌పూర్‌లో రేసుగుర్రం విలన్ రవికిషన్‌ను బీజేపీ బరిలోకి దిపింది. ఉత్తర్ ప్రదేశ్‌ లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి మరో ఏడుగురి పేర్లను బీజేపీ హైకమాండ్ ఇవాళ ప్రకటించింది. అందులో రవి కిషన్‌తో పాటు గోరఖ్‌పూర్ సిట్టింగ్ ఎంపీ ప్రవీణ్ కుమార్ నిషాద్‌కు చోటుదక్కింది. ప్రవీణ్ ఈసారి సంత్ కబీర్‌నగర్ నుండి పోటీ చేయనున్నారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు బీజేపీకి గోరఖ్‌పూర్ కంచుకోటగా ఉండేది. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇక్కడి నుంచే గెలిచారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో సీఎం పగ్గాలను యోగికి అప్పగించారు. అనంతరం జరిగిన గోరఖ్‌పూర్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. ఎస్పీ-బీఎస్పీ కలిసి పోటీచేయడంతో యోగి కోటకు బీటలు వారాయి. ఆ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీచేసిన ప్రవీణ్ కుమార్ నిషద్ భారీ మెజార్టీతో విజయం సాధించి బీజేపీకి షాకిచ్చారు.

అయితే కొన్ని రోజుల క్రితమే ఎస్పీని వీడిన ప్రవీణ్.. కమలం కండువా కప్పకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో ప్రవీణ్‌ను గోరఖ్‌పూర్ నుంచి కాకుండా సంత్ కబీర్‌నగర్‌ నుంచి బీజేపీ పోటీలో నిలబెట్టింది. ఇక గోరఖ్‌పూర్‌లో భోజ్‌పురి మెగాస్టార్ రవి కిషన్‌ను బరిలోకి దింపింది. అయితే భోజ్‌పూరి ఎక్కువగా మాట్లాడే పూర్వాంచల్‌లో రవికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే ఆయనకు గోరఖ్‌పూర్ టికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.