Devineni Uma : దేవినేని ఉమ వర్సెస్ వసంత…! వాటీజ్ దిస్.? రాళ్ళ దాడి, అరెస్టులపై బీజేపీ నేత వ్యంగ్యం

|

Jul 28, 2021 | 5:00 PM

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును అరెస్ట్ చేయడంపై బీజేపీ నేత, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త నూతులపాటి బాల..

Devineni Uma : దేవినేని ఉమ వర్సెస్ వసంత...! వాటీజ్ దిస్.? రాళ్ళ దాడి, అరెస్టులపై బీజేపీ నేత వ్యంగ్యం
Nandivada Police Station
Follow us on

Devineni Uma – Nutulapati Bala : టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును అరెస్ట్ చేయడంపై బీజేపీ నేత, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త నూతులపాటి బాల కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడానికి ఉమ పోలీస్ స్టేషన్‌కి వచ్చిన సమయంలో అక్కడికి వైసీపీ నాయకుడు రావడం, తమ పార్టీ నాయకుడిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారంటూ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. అసలు ఉమ ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన సమయంలోనే వైసీపీ నాయకుడు అక్కడికి ఎందుకు వెళ్ళారో చెప్పాలన్నారాయన.

స్టేషన్ దగ్గర ఉద్రిక్తతకు కారణమైన ఉమతో పాటు, వైసీపీ నాయకుడు పాలడుగు దుర్గా ప్రసాద్ పై కూడా పోలీసులు కేసులు పెట్టాలని బాల డిమాండ్ చేశారు. స్థానికులు కాకపోయినా నియోజకవర్గంలో ప్రజలు గెలిపిస్తే, వారి నియోజకవర్గంలో సమస్యలను అడ్డం పెట్టుకుని కొట్టుకుంటూ మైలవరం నియోజకవర్గ ప్రజలను ఇబ్బందుల పాలు చేయడం తగదన్నారు. తాము ఎవరి పక్షం వహించబోమన్న బాల.. పోలీసులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని కోరారు. గోవులను కోసుకు తింటే తప్పేంటన్న వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై నిరసన తెలిపి మైలవరం తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన అనంతరం బాల ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇలా ఉండగా, మాజీ మంత్రి దేవినేని ఉమ అక్రమ అరెస్టును ఖండిస్తూ నందివాడ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఉమను విడుదల చేయాలంటూ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట నినాదాలు చేశారు. దేవినేని ఉమను చూపించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

Read also : Dasyam Vijayabhaskar : రైల్ రోకో కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు జైలు శిక్ష.. పూర్తి వివరాలు