బీహార్ ఎన్నికల్లో శివసేన పోటీః సంజయ్ రౌత్

|

Oct 06, 2020 | 9:03 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలైంది. అధికార, విపక్ష పార్టీలు పొత్తులు, ఎత్తులపై ఫోకస్ చేశాయి.

బీహార్ ఎన్నికల్లో శివసేన పోటీః సంజయ్ రౌత్
Follow us on

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలైంది. అధికార, విపక్ష పార్టీలు పొత్తులు, ఎత్తులపై ఫోకస్ చేశాయి. బీహార్ అసెంబ్లీ బరిలో నిలవాలని మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన ఉవ్విళ్లురుతుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం ఫ్లాన్ చేసింది. ఇందులో భాగంగా శివసేన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 30నుంచి 40 సీట్లలో పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. బీహార్ రాష్ట్రంలో 50 సీట్లలో పోటీ చేయాలని తమ పార్టీ బీహార్ కార్యకర్తలు కోరుతున్నారన్నారు. త్వరలోనే పార్టీ అధినాయకత్వంలో చర్చించి రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు సంజయ్. బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఎన్నికల బరిలో నిలిస్తే అతనిపై శివసేన అభ్యర్థిని రంగంలో కి దింపుతారా అని ప్రశ్నించగా వేచి చూడండి తానే బీహార్ వెళ్లి దీనికి సమాధానం చెపుతానని సంజయ్ చెప్పారు.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపడంపై శివసేన మాజీ డీజీపీని లక్ష్యంగా చేసుకుంది. మాజీ డీజీపీ పాండే రాజీనామా చేసి నితీష్ పార్టీ పక్షాన ఎన్నికల బరిలో దిగనున్న నేపథ్యంలో శివసేన బీహార్ ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తోంది