Bandi Sanjay: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ..

|

Dec 17, 2021 | 4:59 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజ‌య్ బ‌హిరంగ‌ లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Bandi Sanjay: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ..
Follow us on

Bandi Sanjay – CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజ‌య్ బ‌హిరంగ‌ లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లోగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని.. లేని పక్షంలో బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఎంపీ బండి సంజ‌య్‌. ఉద్యోగ, ఉపాధ్యాయుల రీఅలాట్ మెంట్ (సర్దుబాటు) కోసం జారీ చేసిన 317 జీవో ప్రభుత్వ అనాలోచిత చర్యకు  నిర్ణయానికి నిదర్శనమని.. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయే ప్రమాదమ‌న్నారు. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల స్థానికతను ప్రమాణీకంగా తీసుకోకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం సిగ్గుచేటు లేఖలో వ్యాఖ్యానించారు.

రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 3 ఏళ్లలోపు ఉద్యోగులను సర్దుబాటు చేస్తామని 2018లో 124 జీవో జారీ చేసినా గడవు ముగిసేదాక సీఎం ఆ ఊసే ఎత్తకపోవడం దారుణమ‌ని ఆగ్ర‌హించారు. ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, న్యాయ నిపుణులతో చర్చించకపోవడం సిగ్గుచేటని మండిప‌డ్డారు.

ఇవి కూడా చదవండి: బాదంపప్పుతో ఈ 5 సమస్యలకు పరిష్కారం..! ఔషధాల కంటే తక్కేవేమి కాదు.. ఎలాగో తెలుసుకోండి..

అక్కడ పొరపాటున కూడా నవ్వొద్దు, మద్యం తాగొద్దు.. గీత దాటారో అంతే సంగతి..