టీడీపీకి ఎన్టీఆర్ అవసరం లేదు: బాలయ్య చిన్నల్లుడి సంచలన వ్యాఖ్యలు

| Edited By: Anil kumar poka

Aug 26, 2019 | 9:55 AM

టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అవసరం అనుకుంటే.. ఆయనకు పార్టీలోకి వచ్చే ఉద్దేశం ఉంటే.. అధినేతతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. తనతో పాటు ఎవరికైనా పార్టీనే సుప్రీం అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ జనాలను ప్రభావితం చేసే వ్యక్తి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవమే. కానీ రాజకీయాల్లోకి రావాలంటే.. అధినేత ఆలోచించి, పలానా వ్యక్తి రావాలని భావించాలి. అలాగే […]

టీడీపీకి ఎన్టీఆర్ అవసరం లేదు: బాలయ్య చిన్నల్లుడి సంచలన వ్యాఖ్యలు
Follow us on

టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అవసరం అనుకుంటే.. ఆయనకు పార్టీలోకి వచ్చే ఉద్దేశం ఉంటే.. అధినేతతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. తనతో పాటు ఎవరికైనా పార్టీనే సుప్రీం అని ఆయన అన్నారు.

ఎన్టీఆర్ జనాలను ప్రభావితం చేసే వ్యక్తి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవమే. కానీ రాజకీయాల్లోకి రావాలంటే.. అధినేత ఆలోచించి, పలానా వ్యక్తి రావాలని భావించాలి. అలాగే పార్టీలోకి రావాలని వచ్చే వ్యక్తి(ఎన్టీఆర్) అనుకోవాలి. అయినా జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి అవసరం లేదు. ఎందుకు ఆ అవసరం. ఎన్టీఆర్ వస్తేనే పార్టీకి మంచిది అంటే నేను ఒప్పుకోను. ఆయన పార్టీకి అవసరం. కానీ ఆయనుంటేనే పార్టీ బావుంటుందని తాను అనుకోను అని భరత్ అన్నారు.

యువ నాయకుల టాలెంట్‌తో కొత్త ఆలోచనలు చేయగలిగితేనే పార్టీని బిల్డ్ చేసుకోవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనతో పాటు 294మంది.. జూ. ఎన్టీఆర్‌లా తెలిసినవారు కాదు కదా. అంతేకాదు 200 మంది 30ఏళ్ల లోపు ఉన్నవాళ్లు, కొత్తవాళ్లు. కాబట్టి ఫలానా వ్యక్తి వస్తేనే పార్టీకి బలం అనడం సరికాదు అని శ్రీభరత్ తెలిపారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌కు అప్పగించాలని సోషల్ మీడియాలో అభిమానులు డిమాండ్ చేస్తున్న తరుణంలో శ్రీభరత్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.