ఏ సెంటర్ అయినా, ఎలక్షన్ ఏదైనా, ఓన్లీ సింగిల్ హ్యాండ్ అంటూ సినిమా స్టైల్లో పంచ్ డైలాగులు పేల్చారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఎవరినైనాసరే సింగిల్ హ్యాండ్‌తో మట్టికరిపించగల సత్తా జగన్మోహన్‌రెడ్డికి ఉందన్నారు. బద్వేల్‌లో గెలిచేందుకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలు మూకుమ్మడిగా చేతులు కలిపి.. కుటిల ప్రయత్నాలు చేశారని అన్నారు. అయితే బద్వేల్ ప్రజలు చంద్రబాబుని చితకబాది తరిమికొట్టారన్నారు. ఎమ్మెల్యే సీటు కాదు కదా… అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ వైసీపీ ప్రత్యర్థులకు బద్వేల్ ఓటర్లు బుద్ధిచెప్పారని అన్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 45 వేల మెజార్టీ కట్టబెట్టిన బద్వేల్ నియోజకవర్గ ప్రజలు.. జగనన్న పాలనను చూసి ఇప్పుడు 90 వేలకు పైగా మెజార్టీ కట్టబెట్టారని అన్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని పార్టీని గెలిపించిందని వ్యాఖ్యానించారు.
Also Read..