ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై దాడి

బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. వరంగల్‌ అర్జన్ జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన బయటకు వస్తోన్న సమయంలో.

ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై దాడి

Updated on: Jul 12, 2020 | 6:45 PM

బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. వరంగల్‌ అర్జన్ జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన బయటకు వస్తోన్న సమయంలో.. కొంతమంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకొచ్చారు. ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరిన అరవింద్ కారును అడ్డుకోవడానికి వారు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు వారిని అడ్డుకోగా.. అరవింద్ కాన్వాయ్‌పై దాడి చేశారు. ఆ తరువాత బీజేపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రయత్నించగా.. బీజేపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కి తరలించడంతో అక్కడి పరిస్థితి సద్దుమణిగింది.

Loading...
Unable to load recommendations.
Follow Us