తప్పు చేయలేదని నిరూపించుకుంటా… ఈఎస్ఐ స్కామ్‌పై అచ్చెన్నాయుడు..

| Edited By: Pardhasaradhi Peri

Feb 24, 2020 | 6:53 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లకు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందంటూ ఇటీవల విజిలెన్స్ నివేదిక బయటకు వచ్చింది. దీంతో వైసీపీ అచ్చెన్నాయుడుపై మాటల యుద్ధానికి దిగింది. దీనిపై ఆదివారం అచ్చెన్నాయుడు స్పందించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో తన సోదరుడు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అచ్చెన్నాయుడు […]

తప్పు చేయలేదని నిరూపించుకుంటా... ఈఎస్ఐ స్కామ్‌పై అచ్చెన్నాయుడు..
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లకు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందంటూ ఇటీవల విజిలెన్స్ నివేదిక బయటకు వచ్చింది. దీంతో వైసీపీ అచ్చెన్నాయుడుపై మాటల యుద్ధానికి దిగింది. దీనిపై ఆదివారం అచ్చెన్నాయుడు స్పందించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో తన సోదరుడు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఎర్రనాయుడు వారసులుగా తప్పు చేసే పరిస్థితి మాకు లేదన్నారు. ఈఎస్ఐ స్కామ్‌లో తప్పు చేయలేదని నిరూపించుకుంటానన్న.. ఆయన.. మంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడా కూడా తప్పు చేయలేదని.. కావాలనే జగన్ సర్కార్ తనను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అప్పటి ఈఎస్ఐ ఒప్పందానికి సంబంధించిన ఫైల్స్.. ప్రభుత్వం దగ్గరే ఉన్నాయన్న అచ్చెన్నాయుడు.. ఒక్కసారి సరిచూసుకోండంటూ ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ఫైల్స్ చూడకుండా ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతూ మనోధైర్యాన్ని దెబ్బతీస్తే.. బయపడే వాడిని కాదన్నారు అచ్చెన్నాయుడు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని మండిపడ్డారు.