కాంగ్రెస్ మేనిఫెస్టో పై జైట్లీ కామెంట్స్

ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పేర్కొంది. కాగా ఈ హామీపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చామని.. ఆ ప్యాకేజీని అంగీకరిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. […]

కాంగ్రెస్ మేనిఫెస్టో పై జైట్లీ కామెంట్స్

Updated on: Apr 02, 2019 | 5:37 PM

ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పేర్కొంది. కాగా ఈ హామీపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చామని.. ఆ ప్యాకేజీని అంగీకరిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. ఇక ఆ తర్వాత ఈ అంశంపై చంద్రబాబు యూ-టర్న్ తీసుకున్నారని విమర్శించారు.

కేంద్రం ఆమోదించిన ప్యాకేజి కింద ఏపీకి నిధులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే తమ రాష్ట్రానికి సైతం ప్రత్యేక హోదా కావాలంటూ ఒడిశా సహా అనేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని.. ఇక హోదా కింద ఇచ్చే డబ్బును కాంగ్రెస్ ఎక్కడ నుంచి తెస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.