APPCC vice president: ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు యడ్ల ఆదిరాజు ఆకస్మికంగా మృతి చెందారు. తనకు ఆయాసంగా ఉందని కుటుంబ సభ్యులకు చెబుతూనే ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే ఆదిరాజు మృతి చెందారు. అయితే కరోనాతో మృతి చెంది ఉంటారన్న అనుమానంతో ఆదిరాజు మృతదేహం వద్దకు వెళ్లేందుకు బంధువులు కూడా సాహసించలేదు. కాగా మంచి నేతగా కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఆదిరాజుకు మంచి గుర్తింపు ఉంది. విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఆయన కష్టపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణకు నమ్మినబంటుగా ఉండేవారు. కాగా ఆదిరాజు ఆకస్మిక మృతిపై జిల్లా రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.
Read This Story Also: ప్రభుత్వాసుపత్రికి జ్యోతిక 25లక్షల విరాళం.. సర్వత్రా ప్రశంసలు