ప్రభుత్వాసుపత్రికి జ్యోతిక 25లక్షల విరాళం.. సర్వత్రా ప్రశంసలు

కరోనా వేళ పలువురు సెలబ్రిటీలు ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తమకు తోచినంత సాయం చేస్తున్నారు.

ప్రభుత్వాసుపత్రికి జ్యోతిక 25లక్షల విరాళం.. సర్వత్రా ప్రశంసలు
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2020 | 4:52 PM

Jyothika donation to hospital: కరోనా వేళ పలువురు సెలబ్రిటీలు ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నటి జ్యోతిక ఓ ఆసుపత్రికి 25లక్షలను విరాళంగా ఉన్నారు. తంజావూర్‌లోని ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కోసం ఆమె 25లక్షలను ఇచ్చారు.

అయితే ఆ మధ్య జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో ఆసుపత్రులపై జ్యోతిక కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయ నిర్వహణకి పెట్టే ఖర్చుతో పాటు హుండీలో వేసే మొత్తాన్ని ఆసుపత్రుల్లో వసతులు కల్పించడానికి కేటాయిస్తే బావుంటుందని ఆమె అన్నారు. తన సినిమా షూటింగ్ కోసం ఓ ఆసుపత్రికి వెళ్తే.. అక్కడ పాములు కనిపించాయని, వసతులు కూడా సరిగా లేవని విమర్శించారు. దీనిపై అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. పలువురు జ్యోతికపై విమర్శలు చేశారు. అర్చకులు సైతం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆ విమర్శలకు తాజాగా తన చర్యతో చెక్‌ పెట్టారు జ్యోతిక. మరోవైపు జ్యోతిక చేసిన సాయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Read This Story Also: కోళీకోడ్‌ విమానాశ్రయానికి ఏడాది ముందే నోటీసులు