పులివెందుల పంచాయితీలు సహించం : చంద్రబాబు

|

Jul 23, 2019 | 7:29 PM

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్‌పై ఫైరయ్యారు.  పాదయాత్రలో జగన్ చేసినవన్నీ తప్పుడు వాగ్థానాలని మండిపడ్డారు. తాము హామీలపై ప్రశ్నించినందుకు ముగ్గురు డిప్యూటీ లీడర్లను సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఆదేశిస్తారని.. స్పీకర్ తూచా తప్పకుండా పాటిస్తారని ఆరోపించారు. తమకు మైక్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని.. ఇది పులివెందుల పంచాయితీ అంటూ మండిపడ్డారు. టీడీపీని నైతికంగా దెబ్బ తీయాలని చూస్తున్నారన్నారు. పాదయాత్రలో 250 హామీలు.. అదనంగా 65 హామీలు ఇచ్చారని.. ఇచ్చిన హామీలు […]

పులివెందుల పంచాయితీలు సహించం : చంద్రబాబు
Follow us on

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్‌పై ఫైరయ్యారు.  పాదయాత్రలో జగన్ చేసినవన్నీ తప్పుడు వాగ్థానాలని మండిపడ్డారు. తాము హామీలపై ప్రశ్నించినందుకు ముగ్గురు డిప్యూటీ లీడర్లను సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఆదేశిస్తారని.. స్పీకర్ తూచా తప్పకుండా పాటిస్తారని ఆరోపించారు. తమకు మైక్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని.. ఇది పులివెందుల పంచాయితీ అంటూ మండిపడ్డారు. టీడీపీని నైతికంగా దెబ్బ తీయాలని చూస్తున్నారన్నారు. పాదయాత్రలో 250 హామీలు.. అదనంగా 65 హామీలు ఇచ్చారని.. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు చంద్రబాబు. అసెంబ్లీ జరుగుతుండగానే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని.. కనీసం ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి బీసీల మీద ప్రేమ ఉంటే.. అన్నింటిలో రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేశారు. దేవాదాయశాఖలో రిజర్వేషన్లు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. బీసీల పేరుతో మాయ మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ హయాంలో నాలుగేళ్లలో రూ.4,800కోట్లు కేటాయించామని.. బీసీలు ఎప్పుడూ టీడీపీకి వెన్నెముక అన్నారు. బీసీల కోసం రాజీలేని పోరాటం చేస్తామన్న చంద్రబాబు.. తమ ప్రభుత్వ హయాంలో బీసీ కమిషన్ తీసుకొచ్చామన్నారు.