ట్విట్టర్ చిలుక పలుకులు జనం పట్టించుకోరు- మంత్రి అనిల్

చంద్రబాబు తనయుడు లోకేశ్‌ బయటకి వచ్చి మాట్లాడితే తప్పులు వస్తాయని భయపడి ట్వీట్‌లు పెడుతున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. లోకేశ్‌ ట్వీట్‌లు ఆయనే చేస్తున్నారో.. లేక ఎవరితోనైనా రాయిస్తున్నారో తెలియదన్నారు. నారా లోకేశ్‌ను ఉద్దేశించి ట్విట్టర్ చిలుక..ట్విట్టర్ పలుకులు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయాయని..పరస్పరం సహకార ధోరణిలో ఉంటూ సమస్కలు పరిష్కరించుకోవాలన్నారు. గోదావరి నీటితో రాయలసీమ కరువును తొలగించాలనేదే ముఖ్యమంత్రి  ఆలోచన అని తెలిపారు. విభజన సమస్కలన్నీ పూర్తయిపోతే  […]

ట్విట్టర్ చిలుక పలుకులు జనం పట్టించుకోరు- మంత్రి అనిల్

Edited By:

Updated on: Jul 03, 2019 | 3:19 PM

చంద్రబాబు తనయుడు లోకేశ్‌ బయటకి వచ్చి మాట్లాడితే తప్పులు వస్తాయని భయపడి ట్వీట్‌లు పెడుతున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. లోకేశ్‌ ట్వీట్‌లు ఆయనే చేస్తున్నారో.. లేక ఎవరితోనైనా రాయిస్తున్నారో తెలియదన్నారు. నారా లోకేశ్‌ను ఉద్దేశించి ట్విట్టర్ చిలుక..ట్విట్టర్ పలుకులు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయాయని..పరస్పరం సహకార ధోరణిలో ఉంటూ సమస్కలు పరిష్కరించుకోవాలన్నారు. గోదావరి నీటితో రాయలసీమ కరువును తొలగించాలనేదే ముఖ్యమంత్రి  ఆలోచన అని తెలిపారు. విభజన సమస్కలన్నీ పూర్తయిపోతే  సీఎం వైఎస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందనే టీడీపీ నేతలు భయపడుతున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఇరువురు ముఖ్యమంత్రులు కృషి​ చేస్తున్నట్టు పేర్కొన్నారు.