Sajjala : కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడటంతో పోలవరం ఆలస్యమైంది

|

Jun 30, 2021 | 11:31 PM

2019 తర్వాత మళ్లీ ఇవాళ పోలవరాన్ని పరిశీలించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చీప్ విఫ్ శ్రీకాంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్‌ల బృందం కూడా ఆయన వెంట ప్రాజెక్టును..

Sajjala : కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడటంతో పోలవరం ఆలస్యమైంది
Sajjala
Follow us on

Sajjala : 2019 తర్వాత మళ్లీ ఇవాళ పోలవరాన్ని పరిశీలించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చీప్ విఫ్ శ్రీకాంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్‌ల బృందం కూడా ఆయన వెంట ప్రాజెక్టును సందర్శించింది. స్పిల్ వే బ్రిడ్జి పైనుంచి పనులు జరుగుతున్న తీరును పరిశీలించిన సజ్జల బృందం.. ప్రాజెక్ట్‌లో పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. హిల్ వ్యూ ప్రాంతం నుండి సజ్జల, విప్ ల బృందం ప్రాజెక్ట్ ప్రాంతాన్ని వీక్షించారు. మొత్తం 10 మంది సభ్యుల బృందం బుధవారం పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించింది. కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లోనూ పనులు ఆగకుండా చర్యలు తీసుకున్నారని.. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అవుతుందని  ఈ  సందర్భంగా సజ్జల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ప్రాజెక్టుల ద్వారా బీడు భూములను సస్యశ్యామలం చేసిన మహానీయుడు వైయస్‌ రాజశేఖరరెడ్డి అని సజ్జల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు అన్నారు. వైయస్‌ఆర్‌ అకాల మరణంతో పొలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని.. కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడటంతో పోలవరం ఆలస్యమైందని, వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు వేగం పెరిగిందని సజ్జల చెప్పుకొచ్చారు.

సీఎం వైయస్‌ జగన్‌ టార్గెట్‌ పెట్టుకొని ప్రణాళిక బద్ధంగా పోలవరం పనులు చేయిస్తున్నారు. దీని ఫలితమే ఈ నెల 12వ తేదీ తొలిసారి స్పీల్‌వే ద్వారా గోదావరి నీటిని మళ్లించామని సజ్జల చెప్పారు. ఈ పరిణామాన్ని రాష్ట్రమంతా సంబరాలు చేసుకోవాల్సిన సందర్భమని సజ్జల చెప్పుకొచ్చారు. వైయస్‌ జగన్‌ ఒక దీక్షతో ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి పనులు పరుగులు పెట్టిస్తున్నారని, అందరి కృషితో పనులు ఎక్కడా ఆగకుండా కష్టకాలంలోనూ కొనసాగుతున్నాయని సజ్జల తెలిపారు.

Read also : Thunder bolt : చనిపోయిన వ్యక్తిని ఖననం చేసి వస్తుండగా..పిడుగు రూపం లో వెంటాడిన మరణం