ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయన ఇంటికి చేరుకుని పలువురు మంత్రులు బర్త్ డే విషెస్ తెలియజేశారు. జగన్ మోహన్ రెడ్డి(47) పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో కేక్ కట్ చేయించారు పలువురు మంత్రులు, అధికారులు. అలాగే.. జగన్‌కు ప్రత్యేకంగా పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయిస్తున్న అధికారులు మంత్రులు. pic.twitter.com/G7oCRsYkQI
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 21, 2019