వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు

ఎలక్షన్ మిషన్ 2019పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవంను విజయవంతం చేయాలని ఆయన టీడీపీ నేతలను ఆదేశించారు. టీడీపీ 38వ ఆవిర్భావ దినోత్సవం వినూత్నంగా చేయలని వివరించారు. అనంతరం.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు. మూడు పార్టీలు కుమ్మక్కై వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థలను పతనం చేస్తే టీడీపీ సహించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జిలనే జైళ్లకు పంపిన ఘనులు వైసీపీ నేతలని విమర్శించారు సీఎం. జగన్ […]

వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు

Edited By:

Updated on: Mar 28, 2019 | 2:39 PM

ఎలక్షన్ మిషన్ 2019పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవంను విజయవంతం చేయాలని ఆయన టీడీపీ నేతలను ఆదేశించారు. టీడీపీ 38వ ఆవిర్భావ దినోత్సవం వినూత్నంగా చేయలని వివరించారు. అనంతరం.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు. మూడు పార్టీలు కుమ్మక్కై వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థలను పతనం చేస్తే టీడీపీ సహించదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జడ్జిలనే జైళ్లకు పంపిన ఘనులు వైసీపీ నేతలని విమర్శించారు సీఎం. జగన్ రాజకీయల లబ్ధికోసమే వివేకా భార్య, కూతురుతో ఫిర్యాదులు చేయించారని అన్నారు. వివేకా కూతురు వ్యాఖ్యల్లో రోజురోజుకూ వైరుధ్యాలుంటున్నాయి. వాస్తవాలు బయటకు వస్తాయనే సిట్ నివేదికకు అడ్డంకులు సృష్టించారని సీఎం అన్నారు. కావాలనే.. బీజేపీ, వైసీపీ ఒకటై పోలీసు అధికారులను బదిలీ చేయించారని విమర్శించారు. జగన్ అరాచకాలకు మోడీ వంతపాడుతున్నారని చంద్రబాబు అన్నారు.