కేసీఆర్, జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు

| Edited By:

Mar 30, 2019 | 5:13 PM

ఇచ్చాపురం ఎన్నికల ప్రచార సభలో వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లేనని వ్యాఖ్యానించారు. జగన్ శుక్రవారం కోర్టుకెళ్తాడు.. అసెంబ్లీకి మాత్రం రాడని విమర్శించారు. అసెంబ్లీకి 20 సార్లు వస్తే.. కోర్టుకి మాత్రం 240 సార్లు వెళ్లారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ బెదిరింపులకు తాను భయపడనన్నారు. కేసీఆర్‌ లాంటి వాళ్లను రాజకీయ జీవితంలో చాలా మందిని చూశానని తెలిపారు. కొత్తగా కేసీఆర్‌.. బంగారు బాతుని […]

కేసీఆర్, జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు
Follow us on

ఇచ్చాపురం ఎన్నికల ప్రచార సభలో వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లేనని వ్యాఖ్యానించారు. జగన్ శుక్రవారం కోర్టుకెళ్తాడు.. అసెంబ్లీకి మాత్రం రాడని విమర్శించారు. అసెంబ్లీకి 20 సార్లు వస్తే.. కోర్టుకి మాత్రం 240 సార్లు వెళ్లారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ బెదిరింపులకు తాను భయపడనన్నారు. కేసీఆర్‌ లాంటి వాళ్లను రాజకీయ జీవితంలో చాలా మందిని చూశానని తెలిపారు. కొత్తగా కేసీఆర్‌.. బంగారు బాతుని సృష్టించలేదని సెటైర్ వేశారు.

పొరపాటున జగన్‌ వస్తే ఊరికో రౌడీ తయారవుతారని తెలిపారు. హత్యా రాజకీయాలతో పులివెందుల అట్టుడికిపోతోందన్నారు. మీ ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కావాలంటే టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. జగన్‌కు దొంగలెక్కలు రాసుకోవడం తప్ప ఏమీ తెలియదన్నారు. మోదీ మాటల ప్రధాన మంత్రి అని ఆరోపించారు. మాటలు కోటలు దాటుతాయి.. చేష్టలు గడప కూడా దాటవన్నారు. ఎన్నికల కోసమే మోదీ నోట్లను రద్దు చేశారని వ్యాఖ్యానించారు.