తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఏపీ బీజేపీ

| Edited By:

Aug 22, 2020 | 7:25 AM

జాతీయ, రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే కఠిన చర్యలు తప్పవని ఏపీ రాష్ట్ర బీజేపీ శాఖ హెచ్చరించింది.

తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఏపీ బీజేపీ
Follow us on

AP BJP Warning: జాతీయ, రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే కఠిన చర్యలు తప్పవని ఏపీ రాష్ట్ర బీజేపీ శాఖ హెచ్చరించింది. అభ్యంతరకర రీతిలో ప్రచారం చేస్తే వారిపై క్రమశిక్షణ, క్రిమినల్ చర్యలు తీసుకంటామని తెలిపింది. ప్రచారం చేసే వారిలో ఉద్యోగులుంటే వారిపై చర్యలు తీసుకునేలా సంబంధిత సంస్థలతో పాటు బ్యాంకులను కోరుతామని వివరించింది. విదేశాల్లో ఉన్న వారు ఇలాంటి ప్రచారం చేస్తే సంబంధిత ఇండియన్ ఎంబసీకి సమాచారం పంపి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.ఈ మేరకు ఓ బహిరంగ ప్రకటనను విడుదల చేసింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్‌లు చేసే వారిని గుర్తించేందుకు పార్టీ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని తెలిపింది.

ఇక చంద్రబాబు, లోకేష్‌ రూ.లక్షలు ఖర్చుపెట్టి సోషల్ మీడియాలో బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి మరో ప్రకటనలో మండిపడ్డారు. టీడీపీ కార్యాలయం నుంచి అనధికార వెబ్‌సైట్‌లు, సామాజిక మాధ్యమాల పేరుతో ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ధైర్యం ఉంటే మీ అధికారిక వెబ్‌సైట్‌, అధికారిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఓ వైపు మోదీని పొగుడుతూ చంద్రబాబు లేఖ రాస్తారని.. ఇక్కడ మాత్రం బీజేపీ నేతలను తిట్టాలని తమ్ముళ్లకు చెబుతారని విమర్శించారు. బీజేపీని సలహాలు ఇచ్చే స్థాయికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎదగలేదని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

Read More:

బాబు డైరెక్షన్‌లో రఘురామకృష్ణరాజు

జేఈఈ (మెయిన్) పరీక్షల తేదీలు మారవు..