AP Minister Kannababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటలు నిరాహార దీక్ష చేస్తుంటే.. ఆయన చేసిన ఘోరాలు-నేరాలు గురించి ఆ 36 గంటలూ ప్రజలు మాట్లాడుకుంటారని సెటైర్లు వేశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు. బాబు దీక్షతో టీడీపీకి సింపథీ వస్తుందనుకుంటే పొరపాటు, ఆఖరికి చంద్రబాబు, వారి పార్టీనే అభాసుపాలవుతుంది. అని ఆయన వ్యాఖ్యానించారు. బూతు డ్రామాకు దర్శకత్వం చంద్రబాబే.. అని వ్యాఖ్యానించిన మంత్రి.. బూతులు తిట్టాలి.. రియాక్షన్ వస్తే ఏడవాలి.. దొంగ దీక్షలు చేయాలి.. ఇదే బాబు ఎజెండా అంటూ ఎద్దేవా చేశారు.
బాబు బతుకేంటో.. అమిత్ షాకు బాగా తెలుసు. అంటూ కేంద్ర హోం మంత్రితో చంద్రబాబు భేటీ గురించి కన్నబాబు వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా, రాష్ట్రంలో అలజడికి చేసిన కుట్రలో ప్రధాన ముద్దాయి చంద్రబాబే అని మంత్రి పేర్కొన్నారు.”కండకావరంతో టీడీపీ వాడుతున్న భాషను ఎవరైనా సమర్థిస్తారా..? క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. రాజకీయ అవకాశంగా మలచుకోవడం ఏంటి బాబూ..? ముద్రగడ కుటుంబ సభ్యులపై దాడి చేసినప్పుడు టీడీపీ తోకపార్టీల నోళ్ళు ఎందుకు పెగలలేదు?” అంటూ మంత్రి ప్రశ్నించారు.
“మీ పార్టీని బతికించుకోవడం కోసం అత్యున్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడటం, పైగా దాన్ని సమర్థించుకోవడం సిగ్గుచేటు. తప్పు జరిగింది, మా వాడే ఏదో తెలిసీతెలియక మాట్లాడాడని చంద్రబాబే స్వయంగా క్షమాపణ చెప్పాల్సిందిపోయి, దీన్నొక రాజకీయ అవకాశంగా తీసుకుని రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగినట్టు, చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.” అని కన్నబాబు చెప్పుకొచ్చారు. అంతేకాగు, “చిత్రం ఏంటంటే… చంద్రబాబు నాయుడు… కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఫోన్ చేశారట. ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పారట. చంద్రబాబు ఏంటో, ఆయన పద్ధతి, ఆయన బతుకు ఏంటో, ఆయన రాజకీయ వైఖరి ఏంటో అమిత్‌షాకు బాగా తెలుసు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో .. అమిత్‌షా ఏపీ పర్యటనకు వస్తే ప్రొటోకాల్, ప్రొటక్షన్ ఇవ్వనని, ఆయన కాన్వాయ్ మీద రాళ్లు వేయించిన బ్యాచ్ ఇది. అమిత్ షాకు ఫిర్యాదు చేసినా మీ బతుకు ఏంటో వాళ్లకు బాగా తెలుసు చంద్రబాబు గారూ..” అంటూ కన్నబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read also: Chandrababu: మరికాసేపట్లో ప్రారంభం కానున్న టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష