
ఆసియా ఖండంలోనే సంపన్నుడైన ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ముంబైలో ప్రధాని మోదీ నిర్వహించిన ర్యాలీలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ డియోరాకు రెండు వారాల క్రితం ముకేశ్ అంబానీ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఆయన తనయుడు మోదీ ర్యాలీలో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ర్యాలీలో ముందు వరుసలో కూర్చున్న అనంత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మోదీ చెప్పింది విని దేశానికి మద్దతుగా నిలిచేందుకే ర్యాలీకి హాజరైనట్టు పేర్కొన్నారు.
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ముకేశ్ సోదరుడు అనిల్ అంబానీపై రాహుల్ తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ.. ముకేశ్ అంబానీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకోగా, ఇప్పుడు ఆయన కుమారుడు అనంత్ మోదీ ర్యాలీలో పాల్గొనడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.