బాబూ.. అలా చేసి తప్పు చేశారు: అమిత్ షా చురకలు

| Edited By:

May 24, 2019 | 12:14 PM

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చురకలు వేశారు. ఢిల్లీ చుట్టూ చంద్రబాబు ప్రదక్షణలు చేసే బదులు ఏపీలో ఓట్ల కోసం గట్టి కృషి చేసుంటే ఆయనకు మరికొన్ని సీట్లైనా దక్కేవని ఎద్దేవా చేశారు. ఇది ఆయనకు నేనిచ్చే సలహా అని కామెంట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే అఖండ విజయాన్ని సాధించిన అనంతరం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సభలో అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా […]

బాబూ.. అలా చేసి తప్పు చేశారు: అమిత్ షా చురకలు
Follow us on

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చురకలు వేశారు. ఢిల్లీ చుట్టూ చంద్రబాబు ప్రదక్షణలు చేసే బదులు ఏపీలో ఓట్ల కోసం గట్టి కృషి చేసుంటే ఆయనకు మరికొన్ని సీట్లైనా దక్కేవని ఎద్దేవా చేశారు. ఇది ఆయనకు నేనిచ్చే సలహా అని కామెంట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే అఖండ విజయాన్ని సాధించిన అనంతరం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సభలో అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీకి కొత్త ముఖ్యమంత్రి కానున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు బీజేపీ తరఫున అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో జట్టు కట్టారు చంద్రబాబు నాయుడు. అప్పటి నుంచి ఎన్డీయేకు వ్యతిరేకంగా యూపీఏ పక్షాలతో అంటకాగుతూ.. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. తమతో కలిసి వచ్చే పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే.