కరణం ఎన్నిక చెల్లదు..హైకోర్టుకు ఆమంచి

టీడీపీ చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నిక చెల్లదంటూ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్‌కు కరణం బలరాం తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమంచి దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. కరణం బలరాంకు నలుగురు సంతానం అయితే, ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో ముగ్గురు సంతానం అంటూ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిన కరణం బలరాంపై […]

కరణం ఎన్నిక చెల్లదు..హైకోర్టుకు ఆమంచి

Edited By:

Updated on: Jul 06, 2019 | 9:56 PM

టీడీపీ చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నిక చెల్లదంటూ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్‌కు కరణం బలరాం తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమంచి దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. కరణం బలరాంకు నలుగురు సంతానం అయితే, ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో ముగ్గురు సంతానం అంటూ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిన కరణం బలరాంపై చర్యలు తీసుకోవాలని ఆయన పిటీషన్‌లో కోరారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ తరఫున ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ తరఫున కరణం బలరాం పోటీ చేశారు. ఈ పోటీలో కరణం విజయం సాధించారు