Jallianwala Bagh: విషాదాన్ని కూడా సెలబ్రేట్‌ చేస్తున్నారు.. ప్రధానిపై రాహుల్‌గాంధీ విమర్శలు..

జలియన్‌వాలాబాగ్‌ లాంటి విషాదాన్ని కూడా సెలబ్రేట్‌ చేసుకోవడం ప్రధాని మోదీకే చెల్లుతుందని విమర్శించారు రాహుల్‌గాంధీ. స్మృతిచిహ్నం ప్రారంభం పేరుతో స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్లను అవమానించారని మండిపడ్డారు.

Jallianwala Bagh: విషాదాన్ని కూడా సెలబ్రేట్‌ చేస్తున్నారు.. ప్రధానిపై రాహుల్‌గాంధీ విమర్శలు..
Jallianwala Bagh

Updated on: Aug 31, 2021 | 10:11 PM

జలియన్‌వాలాబాగ్‌ లాంటి విషాదాన్ని కూడా సెలబ్రేట్‌ చేసుకోవడం ప్రధాని మోదీకే చెల్లుతుందని విమర్శించారు రాహుల్‌గాంధీ. స్మృతిచిహ్నం ప్రారంభం పేరుతో స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్లను అవమానించారని మండిపడ్డారు. జలియన్‌ వాలా బాగ్‌ స్మృతిచిహ్నం ప్రారంభం పేరుతో ప్రధాని మోదీ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన యోధులను అవమానించారని రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయనివాళ్లకు జలియన్‌వాలా బాగ్‌ యోధుల త్యాగం విలువ తెలియదన్నారు. స్మారకచిహ్నం ఆధునీకరణ పేరుతో ఆనాటి యోధులను దారుణంగా అవమానించారని మండిపడ్డారు.

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన యోధుడి కుమారుడినని తెలిపారు రాహుల్‌. చాలామంది విపక్ష నేతలు కూడా జలివాలాబాగ్‌ స్మారక చిహ్నం నవీకరణను తప్పుపట్టారు. స్వాతంత్ర్యపోరాటంలో ఓ విషాద ఘట్టాన్ని కేంద్రం సెలబ్రేట్‌ చేయడం దారుణమని శివసేన మండిపడింది. కేంద్రం తీరు స్వాతంత్ర్యసమరయోధులను గౌరవించే విధంగా లేదని , వాళ్లపై బ్రిటీష్‌ డయ్యర్‌ సేన కాల్పులను సమర్ధించినట్టుగా ఉందని విపక్ష నేతలు మండిపడుతున్నారు.

అయితే కాంగ్రెస్‌ లోనే ఈ వ్యవహారంపై భిన్న వాదనలు విన్పించారు పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌. జలియన్‌వాలాబాగ్‌ ఇప్పుడు సర్వాంగ సుందరంగా కన్పిస్తోందని , భావితరాలకు స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను తెలిపే విధంగా ఈ మెమోరియల్‌ను కేంద్రం తీర్చిదిద్దిందని ప్రశంసించారు. జలియన్‌ వాలాబాగ్‌లో అమరులైన యోధుల్లో అన్ని మతాలకు చెందిన వాళ్లందరు ఉన్నారని లెఫ్ట్‌ నేతలంటున్నారు.

స్వాతంత్ర్యసమరంలో ఎలాంటి పాత్ర లేని పార్టీ దీనిపై సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. 102 ఏళ్ల క్రితం పంజాబ్‌ లోని జలియన్‌ వాలాబాగ్‌లో బ్రిటీష్‌ వాళ్లు జరిపిన కాల్పుల్లో 1000 మందికి పైగా చనిపోయారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ల పేర్లను స్మారక చిహ్నంపై చెక్కారు. అయితే దీని ప్రారంభోత్సవంలో లైట్‌షోను విపక్షాలు తప్పుపడుతున్నాయి.

ప్రధాని మోదీకి భారత స్వాతంత్ర్య పోరాట చరిత్ర తెలియదని విమర్శించారు రాహుల్‌గాంధీ. ప్రచార ఆర్భాటం కోసమే జలివాలాబాగ్‌ నవీకరణను ఆయన సెలబ్రేట్‌ చేసుకున్నారని మండిపడ్డారు. మొత్తానికి ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది.

ఇవి కూడా చదవండి: Huzurabad By-Election: ఎవరొస్తారో రండి… టీఆర్ఎస్‌కు ఈటల రాజేందర్ సవాల్..