మోడీపై నటి ఊర్మిళ విమర్శలు

|

Mar 29, 2019 | 7:44 PM

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి ఊర్మిళ బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ పార్టీ మీద తాజాగా తనదైన శైలిలో విమర్శలు చేశారు. దేశంలో విద్వేషం చాలా ఎక్కువగా ఉంది. మతం పేరిట ఒకరినొకరు చంపుకుంటున్నారు. మోడీ పరిపాలనలో ప్రజలు సంతోషంగా లేరు. నిరుద్యోగం అత్యధికంగా ఉంది. మోదీ మంచి వ్యక్తి, కానీ ఆయన విధానాలు కాదని ఆమె అన్నారు. గతంలో వీటిపై తాను తన కుటుంబంతో చర్చించేదని, ఇప్పుడు ఒక వేదిక దొరికిందని తెలిపారు. సమస్యల మీద పోరాడటానికే […]

మోడీపై నటి ఊర్మిళ విమర్శలు
Follow us on

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి ఊర్మిళ బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ పార్టీ మీద తాజాగా తనదైన శైలిలో విమర్శలు చేశారు. దేశంలో విద్వేషం చాలా ఎక్కువగా ఉంది. మతం పేరిట ఒకరినొకరు చంపుకుంటున్నారు. మోడీ పరిపాలనలో ప్రజలు సంతోషంగా లేరు. నిరుద్యోగం అత్యధికంగా ఉంది. మోదీ మంచి వ్యక్తి, కానీ ఆయన విధానాలు కాదని ఆమె అన్నారు.

గతంలో వీటిపై తాను తన కుటుంబంతో చర్చించేదని, ఇప్పుడు ఒక వేదిక దొరికిందని తెలిపారు. సమస్యల మీద పోరాడటానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఎక్కువ కాలం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు అయితే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడతానా లేదా అన్న విషయం ఇంకా తెలీదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఊర్మిళను ముంబయి నార్త్ నుంచి బరిలో దింపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.