మోదీపై ప్రకాష్‌రాజ్ సెటైర్లు

| Edited By:

May 04, 2019 | 2:37 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీపై నటుడు ప్రకాష్‌రాజ్ సెటైర్లు వేశారు. మోదీని చూసి ఓటేయమని బీజేపీ అడుగుతోందని, మరి 500 చోట్ల మోదీనే పోటీ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. ఎవరీ ప్రజ్ఞా ఠాకూర్‌ అంటూ నిలదీశారు. ప్రజాసేవే నేతలకు పరమావధి కావాలని, ప్రశ్నించడం దేశ పౌరుడిగా తన బాధ్యత అని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ముఖ్యమేనని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో జాతీయ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఆయన […]

మోదీపై ప్రకాష్‌రాజ్ సెటైర్లు
Follow us on

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీపై నటుడు ప్రకాష్‌రాజ్ సెటైర్లు వేశారు. మోదీని చూసి ఓటేయమని బీజేపీ అడుగుతోందని, మరి 500 చోట్ల మోదీనే పోటీ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. ఎవరీ ప్రజ్ఞా ఠాకూర్‌ అంటూ నిలదీశారు. ప్రజాసేవే నేతలకు పరమావధి కావాలని, ప్రశ్నించడం దేశ పౌరుడిగా తన బాధ్యత అని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ముఖ్యమేనని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో జాతీయ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర హోదా లేకపోవడంతో ఢిల్లీ, పుదుచ్చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రకాష్‌రాజ్ పేర్కొన్నారు.

‘‘ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడం… ప్రజల అవసరాలకు అనుగుణంగా నడుచుకోవడమే రాజకీయం. విద్వేషాలు చిమ్మటం, కులాలు, మతాల కోసం ఎదుటివారిని తిట్టడం రాజకీయం అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఎవరు ప్రధాని అవుతారో… జనం ఏం కోరుకుంటున్నారో మీరే చూస్తారు. స్థానికంగా సరైన అభ్యర్థిని ఎన్నుకోండి, సమర్థులను లోక్‌సభకు పంపండి. ఆటోమేటిక్‌గా సరైన అభ్యర్థే ప్రధాని అవుతారు. ఒకట్రెండు సార్లు పొరపాటు జరగొచ్చు, ప్రతీసారి పొరపాటు జరగదు’’ అని ప్రకాష్‌రాజ్ తెలిపారు.