మంత్రుల కార్లకు ప్రమాదాలు..కారణం తెలిస్తే షాక్

|

Nov 26, 2019 | 6:21 PM

తెలంగాణ మంత్రుల కాన్వాయ్‌లకు ఏమైంది? వరుస పెట్టి ప్రమాదాలు అవుతున్నాయి? ఇంతకీ కార్లలో లోపమా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే చర్చ ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. బుల్లెట్‌ ప్రూప్‌ వీడి హై-ఎండ్‌ వెహికల్స్‌పై మంత్రులు మోజు పడడమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. ఇంతకీ హై ఫై కార్లతో ఏం జరుగుతోంది? తెలంగాణలో మంత్రుల కాన్వాయ్‌ల్లో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాన్వాయ్‌లో వెహికల్స్‌ ఢీ కొంటున్నాయి. బయటకు రాని ఎన్నో చిన్న ప్రమాదాలు కూడా జరుగుతూనే […]

మంత్రుల కార్లకు ప్రమాదాలు..కారణం తెలిస్తే షాక్
Follow us on

తెలంగాణ మంత్రుల కాన్వాయ్‌లకు ఏమైంది? వరుస పెట్టి ప్రమాదాలు అవుతున్నాయి? ఇంతకీ కార్లలో లోపమా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే చర్చ ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. బుల్లెట్‌ ప్రూప్‌ వీడి హై-ఎండ్‌ వెహికల్స్‌పై మంత్రులు మోజు పడడమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. ఇంతకీ హై ఫై కార్లతో ఏం జరుగుతోంది? తెలంగాణలో మంత్రుల కాన్వాయ్‌ల్లో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాన్వాయ్‌లో వెహికల్స్‌ ఢీ కొంటున్నాయి. బయటకు రాని ఎన్నో చిన్న ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉన్నాయి.

ఇటీవలే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. మంత్రి కాన్వాయ్‌లో వెనుక వస్తున్న వెహికల్‌ బోల్తా పడి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో మంత్రుల కాన్వాయ్‌లో తరచూ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయనే ఇష్యూ మొదలైంది. కాన్వాయ్‌లో ఏం జరుగుతుంది? అని ఆరా తీస్తే అసలు విషయాలు బయటకు వచ్చాయట.

కాన్వాయ్‌లో మంత్రులకు బుల్లెట్‌ ప్రూప్‌ కారు ఇచ్చారు. లేటెస్ట్‌ వెర్షన్‌ ఫార్చూనర్‌ వాడుతున్నారు. అయితే ఈ కారు సౌకర్యంగా లేదని మంత్రులు…తమ సొంత కార్లలో ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వాహనాన్ని వదిలి ఓల్వో, బెంజ్ కార్లలో తిరుగుతున్నారు. ఈ కార్లు హై ఎండ్‌. సెకన్లలో వంద కిలోమీటర్ల స్పీడ్‌ దాటి పరుగులు పెడతాయి. దీంతో ఈ కార్ల స్పీడును కాన్వాయ్‌లోని ఇతర వాహనాలు అందుకోలేక పోతున్నాయి.

మంత్రి కారును అందుకోవాలని స్పీడ్‌గా వెళ్లి పైలెట్, ఎస్కార్ట్, సిబ్బంది వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయట. తాజాగా జరిగిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్‌ ప్రమాదంలోనూ ఇదే జరిగిందట. తన సొంత బెంజ్ కారులో ఎర్రబెల్లి ప్రయాణం చేస్తే…..ఆయన కారును అందుకోవాలని స్పీడ్‌గా కాన్వాయ్‌లోని వెహికల్‌ వెళ్లిందట. చివర్లో స్పీడ్‌ కంట్రోల్ కాకపోవడంతో ప్రమాదానికి గురైందట.

గతంలో కూడా ఈటెల రాజేందర్‌ కాన్వాయ్‌లో వెహికల్‌ బోల్తా పడింది. అయితే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడం వల్ల ఆయన సురక్షితంగా బయటపడ్డారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్‌లు కూడా అప్పుడప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ వదిలి సొంత వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని పోలీసులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో మంత్రులందరూ కచ్చితంగా బుల్లెట్టు వాహనాలు వాడాలని సీఎం ఆదేశించారు.

అయినప్పటికీ మళ్ళీ కొంత మంది మంత్రులు సొంత వాహనాల్ని వాడుతున్నారు. రూరల్ ఏరియాలో, సింగిల్ రోడ్లపై మంత్రుల కాన్వాయ్‌లకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు కంట్రోల్ తప్పి సామాన్యులపై దూసుకెళ్తున్నాయి. వరుసగా జరుగుతున్న ప్రమాదాలు చూసైనా మంత్రుల తీరు మార్చుకోవాలని బయటికి చెప్పుకోలేక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.