Goa Assembly Elections 2022: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఆప్.. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలతో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఆ మేరకు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఆదివారంనాడు ఉత్తరాఖండ్‌లో పర్యటించిన ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్.. అక్కడ తిరంగా సంకల్ప్ యాత్ర నిర్వహించారు. సోమవారం గోవా పర్యటనకు శ్రీకారం చుట్టారు.
గోవా యువకులకు ఉద్యోగాలు లభించడంలేదన్న కేజ్రీవాల్.. ఈ సమస్యపై స్థానికులతో మాట్లాడేందుకు అక్కడకు వస్తున్నానంటూ సోమవారం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. గోవాలో నిరుద్యోగుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరిందన్నారు. గోవాలో డబ్బు, పలుకుబడి ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకుతున్నాయంటూ అధికార బీజేపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. నిరుద్యోగ సమస్య అజెండాతో గోవా అసెంబ్లీ ఎన్నికలను ఆప్ ఎదుర్కోబోతున్నట్లు కేజ్రీవాల్ పరోక్షంగా వెల్లడించారు.
అర్వింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్..
With unemployment at its peak, Goa’s youth are not getting jobs. Government jobs are available only to people with money and connections.
Coming to Goa to discuss this issue with the People of Goa.
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 20, 2021
గోవాలో నిరుద్యోగ సమస్యపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఈ నెల మొదటివారంలో ఆప్ ప్రారంభించింది. ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓటు వేయొద్దని ఆ పార్టీ పిలుపునిస్తోంది.
Also Read..
నీలి చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్తకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ముంబై కోర్టు
Bank News: రూ.170 కోట్లు.. కస్టమర్ల నుంచి ముక్కు పిండి ఆ ఛార్జీలు వసూలు చేసిన పీఎన్‌బీ