కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ అకౌంట్ తో బాటు పార్టీకి చెందిన మరో అయిదుగురు నేతల ట్విటర్ ఖాతాలను కూడా తాత్కాలికంగా బ్లాక్ చేశారు. పార్టీ మీడియా హెడ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, లోక్ సభలో పార్టీ విప్ మాణిక్యం ఠాగూర్, మాజీ మంత్రి జితేంద్ర సింగ్,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ అకౌంట్లను బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు ప్రధాని మోదీని, ట్విటర్ చీఫ్ జాక్ డోర్సేను అజయ్ మాకెన్ తీవ్రంగా తప్పు పడుతూ..ఇలాంటి చర్యలు ప్రజా సంక్షేమంకోసం తాము చేస్తున్న పోరాటాన్ని ఆపజాలవన్నారు. ట్విటర్ చర్యపట్ల ఆయన నిరసన తెలియజేస్తూ.. ఎంతకాలం బ్లాక్ చేస్తారని ప్రశ్నించారు. ఈయన కాంగ్రెస్ కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ హెడ్ కూడా..ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ప్రధాని నుంచి ఒత్తిడి వచ్చిన ఫలితంగానే రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతాను క్లోజ్ చేశారన్నారు. ఢిల్లీలో ఇటీవల తొమ్మిదేళ్ల బాలిక హత్యాచార ఘటన నేపథ్యంలో రాహుల్.. ఆమెతో బాటు ఆమె తలిదండ్రుల ఫోటోలను కూడా తన ట్విటర్ అకౌంట్ లో షేర్ చేశారు.దీనిని తీవ్రంగా పరిగణించిన జాతీయ బాలల హక్కుల సంఘం.. ఇది నిబంధనలను అతిక్రమించడమేనంటూ.. తగిన చర్య తీసుకోవలసిందిగా ట్విటర్ ను కోరింది.
బాధితుల ఫోటోలను ప్రచురించరాదని. ఇది .పోక్సో రూల్స్ ఉల్లంఘనే అని పేర్కొంది. రాహుల్ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని. లీగల్ చర్య తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. అయితే ఆయన ట్వీట్స్ ని తొలగించామని ట్విటర్ తరఫు సీనియర్ లాయర్ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ పై విచారణను కోర్టు వచ్చేనెలకు వాయిదా వేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి : షూటింగ్స్ లో డేంజర్ బెల్స్.. స్టన్నింగ్ స్టంట్ చేసేప్పుడు సీన్ రివర్స్ అయితే…?:Danger Bells In Shooting Live video.
బుర్జ్ ఖలీఫా హోటల్ పై మహిళ…ఇదెక్కడి యాడ్ రా మావా..!వీడియో వైరల్..:woman on Burj Khalifa Video.
రాంగ్ రూటులో వచ్చిన మహిళ..అంతలోనే ప్రమాదం.!రెప్పపాటులో రెండు కాళ్ళు పోయాయి..: Traffic Rules Video.