తాజాగా ఇరు రాష్ట్రాల సరిహద్దు వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై మిజోరాంలో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. సీఎంతో పాటు మరో నలుగురు పోలీసు ఉన్నతాధికారులపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. ఐజీ అనురాగ్ అగర్వాల్, డీఐజీ కచార్ దేవోజ్యోతి ముఖర్జీ, కచార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రకాంత్ నింబాల్కర్, ధోలై పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆఫీసర్ ఉద్దీన్, నీహ్లయా మీద ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది.