కొత్త సంవత్సరం కొత్త ఆశలతో, కొత్త ప్రారంభాల సమయం. చాలా మంది ఆరోగ్యంగా ఉండాలని, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానం చేసుకుంటారు. బిజీబిజీ జీవితంలో ప్రతి ఒకరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మీరు కూడా ఈ సంవత్సరం మీ ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకోవాలనుకుంటే.. రోజువారీ జీవితంలో యోగాను చేర్చుకోవడం ఉత్తమ మార్గం. యోగా అనేది శరీరాన్ని దృఢంగా, ఫ్లెక్సిబుల్‌గా మార్చే వ్యాయామం.
అంతేకాదు యోగా మానసిక ప్రశాంతత, శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడమే కాదు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతిరోజూ ఐదు యోగా ఆసనాలు చేయడం అలవాటు చేసుకోండి. ఈ యోగాసనాలు మీ ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడమే కాదు రోజంతా మిమ్మల్ని తాజాగా, ఉత్సాహంగా ఉంచుతాయి. ఆ యోగానసనాలు ఏమిటి.. వాటితో ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
తడసానా: నిటారుగా నిలబడి రెండు చేతులను పైకి లేపి, పాదాల కాలిపై బ్యాలెన్స్ చేయాలి. ఈ ఆసనం శరీర భంగిమను మెరుగుపరుస్తుంది. వెన్నెముకను బలపరుస్తుంది. శరీరాన్ని అనువైనదిగా చేస్తుంది.
భుజంగాసనం: కడుపుపై పడుకుని.. మీ చేతులను మీ భుజాల దగ్గర ఉంచి, మీ పైభాగాన్ని నెమ్మదిగా పైకి లేపండి. ఈ ఆసనం వెన్నె ముక కండరాలను బలపరుస్తుంది, వెన్నెముకను అనువైనదిగా చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
చాలా మంది ఉదయం పూట వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు. అయితే బరువు తగ్గడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కొంత మందికి కష్టమైన పని. కానీ సరైన మార్గనిర్దేశం లేకుండా ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల అనేక రకాల సమస్యలకు గురవుతుంటారు.
సూర్య నమస్కారం: ఈ ఆసనం 12 విభిన్న భంగిమలతో రూపొందించబడింది. ఈ ఆసనం ఒక్కొక్క యోగాసనంతో చేయాల్సి ఉంటుంది. ఇది శరీరాన్ని వేడి చేస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
శవాసన: విశ్రాంతిగా పడుకోండి. శరీరానికి విశ్రాంతి తీసుకోండి. లోతైన శ్వాస తీసుకోండి. ఇలా చేయడం వల్ల సులభంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. శరీరానికి పూర్తి విశ్రాంతి కూడా లభిస్తుంది. కనుక దినచర్యలో యోగాను చేర్చుకోండి.. యోగాసనాలను అలవాటు చేసుకోండి.
రోజువారీ దినచర్యలో యోగాను చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు యోగాను రోజూ చేయడం వలన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తుంది. శరీర బలం, వశ్యత, శక్తిని పెంచుతుంది. దీనితో పాటు ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రోజూ యోగా చేయడం వల్ల బరువు తగ్గడంతోపాటు రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అందువల్ల వీలైతే రాబోయే సంవత్సరంలో అంటే 2025లో మీ దినచర్యలో యోగా చేయడం అలవాటు చేసుకోండి. జీవితాన్ని ఆరోగ్యంగా జీవించండి.