అధిక రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు పవన్ముక్తాసనం చేయాలి. ఈ ఆసనం వేయడం అంత కష్టం కాదు. ఇలా చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటమే కాదు కడుపులో గ్యాస్ విడుదల చేయడం, వెన్నునొప్పి నుంచి ఉపశమనం, ఒత్తిడి తగ్గించడం, పొట్ట దగ్గర కొవ్వు తగ్గడం, ఎసిడిటీ నుంచి ఉపశమనం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. Photo Credit: Getty Images
బలాసనం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. నిద్రను మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం అధిక BP ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యోగాసనం అలసటను దూరం చేస్తుంది. గుండె కండరాలను బలపరుస్తుంది. అంతేకాదు బలాసనా మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆసనం చేయడం వల్ల స్త్రీలు పీరియడ్స్ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. Photo Credit: Daniel de la Hoz/Moment/Getty Images
సేతుబంధాసన చేస్తున్నప్పుడు ఛాతీ కండరాలు తెరుచుకుంటాయి. దీంతో ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల అధిక రక్తపోటు ఉన్నవారు చాలా ప్రయోజనం పొందుతారు. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమి, ఉబ్బసం, థైరాయిడ్ మొదలైన వాటి నుండి ఉపశమనం అందించడంలో సేతుబంధాసనాన్ని రెగ్యులర్ గా అభ్యాసం చేయడం ఆరోగ్యానికి మంచి సహాయకారి. Photo Credit: aluxum/E+/Getty Images
హస్త పదంగుష్ఠాసనం చేయడం వల్ల అధిక బీపీ ఉన్నవారికి కూడా మేలు జరుగుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల చీలమండలు, తొడలు, తుంటి, తొడ కండరాలు దృఢంగా ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏకాగ్రతను కూడా మెరుగుపరుస్తుంది. Photo Credit: aluxum/E+/Getty Images
అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ భ్రమరీ ప్రాణాయామం చేయాలి. ఇది చాలా ప్రయోజనకరం. ఈ ప్రాణాయామం చేయడం ద్వారా, ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఆందోళన, మైగ్రేన్, సాధారణ తలనొప్పి తగ్గడం, మనస్సు ప్రశాంతత, దృష్టి పెరగడం, వినికిడి సామర్థ్యం పెరగడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. Photo Credit: aluxum/E+/Getty Images