
ఈ పుట్టగొడుగులు వేలులు పెట్టినా దొరకవు. ఈ పుట్టగొడుగులు కిలో లక్షల రూపాయలలో లభిస్తాయి. ప్రపంచంలోని ధనవంతులు మాత్రమే వీటిని తింటారు. ఈ రోజు విలువైన పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం.

యూరోపియన్ వైట్ ట్రఫుల్ మష్రూమ్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగుల విషయానికి వస్తే, యూరోపియన్ వైట్ ట్రఫుల్ మష్రూమ్ పేరు మొదటగా వినిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన పుట్టగొడుగు ఇదేనని చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో ధర 8 నుంచి 9 లక్షల రూపాయలు. విశేషమేమిటంటే యూరోపియన్ వైట్ ట్రఫుల్ మష్రూమ్ సాగు చేయరు.. ప్రకృతి ప్రసాదిత పుట్టగొడులు ఇవి. పాత చెట్లపై స్వయంగా పెరుగుతాయి. వీటిని తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి.

మాట్సుటేక్ పుట్టగొడుగు: ధర పరంగా మాట్సుటేక్ పుట్టగొడుగుకు సరిపోలదు. అయితే దీని ధర కూడా లక్షల్లోనే ఉంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో కేజీ మాట్సుటేక్ పుట్టగొడుగు ధర రూ.3 నుంచి 5 లక్షలు పలుకుతోంది. విశేషమేమిటంటే మాట్సుటేక్ పుట్టగొడుగు దీని సువాసనతో ప్రసిద్ధి చెందింది. ఇది గోధుమ రంగులో ఉంటుంది. దీనితో కూర చేస్తే అత్యంత రుచికరంగా ఉంటుంది.

చాంటెరెల్ మష్రూమ్: చాంటెరెల్ మష్రూమ్ కూడా సాగు చేయరు.. ఇవి కూడా అడవులలో దానంతట అవే పెరుగుతాయి. అంతేకాదు ఈ చాంటెరెల్ పుట్టగొడుగులు ప్రపంచవ్యాప్తంగా కనిపించవు. ఇవి యూరప్, ఉక్రెయిన్ బీచ్‌లలో మాత్రమే పెరుగుతాయి. చాంటెరెల్ పుట్టగొడుగులలో అనేక రంగులు ఉన్నాయి. అయితే పసుపు రంగు చాంటెరెల్ పుట్టగొడుగు ప్రజలలో అత్యంత ప్రసిద్ధి చెందింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి ధర కిలో రూ.30,000 నుంచి 40,000 వరకూ ఉంటాయి.

బ్లాక్ ట్రఫుల్ మష్రూమ్: బ్లాక్ ట్రఫుల్ మష్రూమ్ ఐరోపాలోని వైట్ ట్రఫుల్ మష్రూమ్ లాంటిది. ఇది కూడా చాలా అరుదైన రకం పుట్టగొడుగు. విదేశాల్లో బ్లాక్ ట్రఫుల్ మష్రూమ్ ధర కూడా కిలో లక్ష నుంచి 2 లక్షల రూపాయలు.

గుచ్చి మష్రూమ్: హిమాచల్ పర్వతానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గుచ్చి పుట్టగొడుగులు కనిపిస్తాయి. ఈ మష్రూమ్స్ కూడా సాగు చేయరు. ఇవి పర్వతాలలో దానంతట అవే పెరుగుతాయి. వీటిని స్పాంజ్ మష్రూమ్ అని కూడా అంటారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర కిలో 25,000 నుండి 30,000 రూపాయలు.