PM Modi: బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొన్న ప్రధాని మోడీ.. త్రివిధ దళాల సిబ్బందికి ప్రశంసలు.. అదిరిపోయే ఫొటోలు..

|

Jul 14, 2023 | 6:06 PM

PM Modi France Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోడీ శుక్రవారం ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

1 / 7

2 / 7
బాస్టిల్ డే పరేడ్‌లో గౌరవ అతిథిగా.. ప్రధాని మోడీ.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు గౌరవవందనాన్ని స్వీకరించారు.

3 / 7
యూరప్‌లో అతిపెద్ద సైనిక కవాతుగా పేరొందిన ఈ పరేడ్‌లో భారతీయ త్రివిధ దళాలు సైతం పాల్గొన్నాయి. ఫ్రాన్స్, ఇండియా సైనికుల ఈ పరేడ్ అందరినీ ఆకట్టుకుంటుంది.

4 / 7
బాస్టిల్ డే పరేడ్ లో ఫ్రెంచ్ జెట్‌లతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కి చెందిన రాఫెల్ ఫైటర్ జెట్‌లు కూడా ఫ్లైపాస్ట్‌లో చేశాయి.

5 / 7
"భారతదేశం, శతాబ్దాల నాటి తత్వంతో ప్రేరణ పొందింది.. శాంతియుతంగా, సుసంపన్నంగా.. సుస్థిరమైనదిగా మార్చడానికి కట్టుబడి ఉంది. బలమైన, విశ్వసనీయ భాగస్వామిగా ఉన్నందుకు 1.4 బిలియన్ల భారతీయులు ఫ్రాన్స్‌కు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతారు. బంధం మరింత లోతుగా సాగుతుంది" అని మోదీ ట్వీట్ చేశారు.

6 / 7
"ప్రపంచ చరిత్రలో ఒక దిగ్గజం, భవిష్యత్తులో నిర్ణయాత్మక పాత్ర పోషించాలి, వ్యూహాత్మక భాగస్వామి, స్నేహితుడు.. 14 జూలై పరేడ్‌లో గౌరవ అతిథిగా భారతదేశాన్ని స్వాగతిస్తున్నందుకు మేము గర్విస్తున్నాము" అని అంతకుముందు మాక్రాన్ ట్వీట్ చేశారు.

7 / 7
ఈ పర్యటనలో ప్రధాని మోడీ, ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు మాక్రాన్.. రక్షణ, అంతరిక్ష, మౌలిక, సాంస్కృతిక రంగాలతోపాటు వివిధ విభాగాల్లో భారత్-ఫ్రాన్స్ బంధాల బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు.