US Navy’s operation in Indian waters : భారత జలాల్లో అమెరికా నేవీ ఆపరేషన్స్‌, ఇండియా మితిమీరిన హక్కును సవాలు చేశామంటోన్న అగ్రరాజ్యం

US Navy’s operation : ఎఫ్‌ఓఎన్‌ఓపీ ద్వారా అంతర్జాతీయ చట్టాలు గుర్తించిన సముద్ర జలాల్లో నేవిగేషన్‌కు ఉన్న స్వేచ్చను, హక్కులను, చట్టబద్ధ వినియోగాన్ని నిర్ధారించామని ప్రకటించిన అమెరికా నౌకాదళం

  • Venkata Narayana
  • Publish Date - 10:49 pm, Sun, 11 April 21
1/5
అంతర్జాతీయ జలాల పరిధి విషయంలో భారత వాదనను సవాలు చేస్తూ, భారతదేశం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే, లక్షద్వీప్‌ సమీపంలోని భారతీయ జలాల్లో ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ ఆపరేషన్‌(ఎఫ్‌ఓఎన్‌ఓపీ)’ను నిర్వహించిన అమెరికా
2/5
అమెరికా నేవీ తీరుపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. సముద్ర జలాల విషయంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లం ఘించడం సరికాదని యూఎస్‌కు స్పష్టం చేసింది.
3/5
దేశాల ప్రత్యేక ఆర్థిక ప్రాంతాలు(ఈఈజెడ్‌), కాంటినెంటల్‌ జోన్‌ల పరిధిలో ఇతర దేశాలు.. అనుమతి లేకుండా కార్యకలాపాలు చేపట్టడం, ముఖ్యంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు వినియోగించడం ‘యూఎన్‌ కన్వెన్షన్‌ ఆన్‌ ది లా ఆఫ్‌ ది సీ’కి వ్యతిరేకమని చెప్పిన భారత విదేశాంగ శాఖ.
4/5
‘క్షిపణి విధ్వంసక నౌక ‘జాన్‌ పాల్‌ జోన్స్‌ భారతీయ జలాల్లో ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ ఆపరేషన్‌’లో పాల్గొంది. తద్వారా ఆ జలాల పరిధిపై భారత దేశం పేర్కొంటున్న మితిమీరిన హక్కును సవాలు చేశామని అగ్రరాజ్యం చెబుతోంది.
5/5
‘మాల్దీవులకు సమీపంలో ఆ దేశ ఈఈజెడ్‌ పరిధి లోపల ఎటువంటి అనుమతి తీసుకోకుండానే సాధారణ ఆపరేషన్స్‌ చేపట్టడం ద్వారా నేవిగేషన్‌కు ఉన్న స్వేచ్ఛను, హక్కులను నిర్ధారించాం’ అని చెబుతున్న అమెరికా
Ads By Adgebra

India vs Sri Lanka 2nd T20: భారత్, శ్రీలంక మధ్య రెండో టీ20 మొదలైంది. ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో…