
హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 20 రోజుల పాటు మిస్ వర్డ్ పోటీల కార్యక్రమాలు జరగనున్నాయి.ఈ పోటీలకు 120 దేశాల అందత్తెలు పాల్గొన్నారు.

ఇక మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, వారసత్వం,పర్యాటక ప్రదేశాలను ఈ ముద్దుగుమ్మలకు పరిచయం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మొన్న చార్మినార్‌లో ఈ బ్యూటీలు సందడి చేసిన విషయం తెలిసిందే.

తర్వాత వరంగల్ వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయాన్ని సందర్శించి అక్కడ తెలంగాణ సంస్కృతి కట్టు బొట్టుతో అందంగా తయారై అందరినీ ఆకట్టుకున్నారు. అంతే కాకుండా అక్కడ బతుకమ్మ పాటలకు డ్యాన్స్ చేసి సందడి చేశారు.అలాగే యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.

ఇక రీసెంట్‌గా ప్రపంచ అందగత్తెలు ఎకో పార్క్‌ను సందర్శించారు. అక్కడి బ్యూటిపుల్ ప్లేసెస్ చూస్తూ ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా సరదాగా సెల్ఫీలు దిగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ మిస్ వరల్డ్ బ్యూటీస్ ఎకో పార్క్‌లో సంది చేస్తూ పార్క్‌కు కళ తీసుకొచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.