ప్రస్తుత అధునిక కాలంలో ఇల్లు కట్టడం ఒక గగనం.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భూమి పరిమాణం పెరగకపోవడంతో చిన్న చిన్న కుటీరాలకే పరిమితం కావల్సిన పరిస్థితి. అంతేకాదు. కట్టిన ఇళ్లు ఎదో కొద్దిరోజులకే కుప్పకూలి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అయితే, ఇథియోపియాలోని ఓ ఇప్పటికీ చెక్కుచెదరకుండా సముద్ర మట్టానికి 1,600 మీటర్లు, దాదాపు 5,200 అడుగుల ఎత్తులో ఉంది. 900 ఏళ్లనాటి ఈ గ్రామానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ గ్రామంలో సందులు, దారులు, రహదారులు, అడ్డదారులు ఇలా చాలానే ఉన్నాయి. కానీ, ఆ గ్రామం మొత్తానికీ రెండే రెండు ద్వారాలు ఉన్నాయి. లోపల ఎన్ని సందుగొందులు తిరిగినా ఆ రెండు ద్వారాల నుంచే బయటికి,. లోపలికి రాకపోకలు సాగించాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే వందల కుటుంబాలు ఉన్నా, రెండు ద్వారాల ఇల్లులాంటి ఊరది. ప్రపంచంలోనే ఎల్తైన గ్రామాల్లో ఇదొకటి.