ఇండోనేషియా: ఈ దేశం ద్వీపాలకు పెట్టింది పేరు. ఇక్కడ బాలి ద్వీపం అత్యంత పర్యాటక స్థలం. ఈ దేశంలో మన రూపాయి విలువ - 197.6 ఇండోనేషియా రుపియాతో సమానం.
వియత్నాం: ఈ దేశం వంటకాలకు, నదులకు ప్రసిద్ది చెందినది. ఇక్కడ నదుల్లో పర్యాటకులు బోటింగ్, సర్ఫింగ్ వంటివి ఎక్కువగా చేస్తారు. ఈ దేశం భారతీయులకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడ మన రూపాయి విలువ - 326.87 వియత్నాం డాంగ్‌కు సమానం.
కంబోడియా: తక్కువ ఖర్చుతో వెకేషన్‌కు వెళ్లి వచ్చే దేశాల్లో కంబోడియా కూడా ఒకటి. ఇక్కడ ఆంగ్‌కోర్ వాట్ రాతి దేవాలయం ఎక్కువ ప్రాచుర్యం పొందింది. రాయల్ ప్యాలెస్, నేషనల్ మ్యూజియం వంటి మరెన్నో పర్యాటక స్థలాలు కంబోడియాలో ఉన్నాయి. ఇక్కడ మన రూపాయి విలువ - 57.34 కంబోడియన్ రియల్‌తో సమానం.
శ్రీలంక: లంకలో బీచ్‌లు, పర్వతాలు, చారిత్రక కట్టడాలు బాగా ఫేమస్. అప్పుడప్పుడూ శ్రీలంకలో మనవాళ్లు సినిమా షూటింగ్స్ కూడా జరిపారు. ఇది ఇండియాకు చాలా దగ్గర కావడం, విమాన టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో భారతీయులు ఎక్కువగా వెళ్తుంటారు. ఇక్కడ మన రూపాయి - 2.56 శ్రీలంక రూపాయలతో సమానం.
నేపాల్: అద్భుత శిఖరాలకు ఈ దేశం నిలయం. మౌంట్ ఎవరెస్ట్, ప్రపంచంలోనే ఏడు ఇతర ఎత్తైన శిఖరాలు నేపాల్‌లో ఉన్నాయి. నేపాల్‌కు వెళ్లేందుకు వీసాలు అక్కర్లేదు. అక్కడ మన రూపాయి - 1.60 నేపాలీ రూపాయికి సమానం
ఐస్‌ల్యాండ్: ఈ ద్వీప దేశం భూమిపై అత్యంత అందమైన ప్రదేశం. వేసవికాలంలో వెళ్లడానికి ఈ టూరిస్ట్ ప్లేస్ సరైన ఆప్షన్. నల్ల ఇసుక బీచ్‌లు, జలపాతాలు, నీలం మడుగులు ఇక్కడ ఫేమస్. ఇక్కడ మన రూపాయి - 1.73 ఐస్లాండిక్ క్రోనాతో సమానం.
హంగేరి: హంగేరి దేశం ఆర్కిటెక్చర్‌కు పెట్టింది పేరు. అక్కడ పురాతన కోటలు, పార్కులను ఖచ్చితంగా సందర్శించాలి. రోమన్, టర్కిష్, ఇతర సంస్కృతులకు ఈ దేశం ప్రసిద్ది. ఇక్కడ మన రూపాయి - 4.17 హంగేరియన్ ఫోరింట్‌కు సమానం.
జపాన్: జపాన్ దేశంలో ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయి. ముఖ్యంగా సుశి, చెర్రీ, సేక్ వంటి ఉద్యానవనాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఇక్కడ మన రూపాయి విలువ - 1.55 జపనీస్ యెన్‌కు సమానం.
పరాగ్వే: ద్వీప దేశమైన పరాగ్వేలో ప్రకృతి సౌందర్యాలు కట్టిపడేస్తాయి. అక్కడి గ్రామీణ హస్తకళలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ మన రూపాయి విలువ 90.93 పరాగ్వే గ్వారానితో సమానం.
మంగోలియా: మంగోలియాలో విశాలమైన ఖాళీ ప్రదేశాలు ఎక్కువ. ఇక్కడ అందాలను చూస్తూ గడిపేయొచ్చు. ఈ దేశంలో మన రూపాయి విలువ -38.40 మంగోలియన్ తుగ్రిక్‌తో సమానం.
కోస్టారికా: మధ్య అమెరికాకు చెందిన ఈ దేశంలోని బీచ్‌లు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. అడవులు, అందులోని వన్యప్రాణులు, అగ్ని పర్వతాలు ప్రత్యేక ఆకర్షణలు. ఇక్కడ మన రూపాయి - 8.00 కోస్టారికన్ కోలన్‌తో సమానం.
పాకిస్తాన్: దాయాది దేశమైన పాకిస్తాన్‌లో పలు పర్యాటక స్థలాలు ఉన్నాయి. స్వాత్ జిల్లా, కరాచీ, లాహోర్‌లో పలు సందర్శనాస్థలాలు ఉన్నాయి. ఇక్కడ మన రూపాయి విలువ - 2.19 పాకిస్తానీ రూపాయితో సమానం.
చిలీ: పర్వతారోహణలు, విశాలమైన అడవులకు, ద్రాక్ష తోటలకు, నదులు, లోయలకు చిలీ పెట్టింది పేరు. ఇక్కడ మన రూపాయి విలువ - 10.75 చిలియన్ పెసోతో సమానం.
దక్షిణ కొరియా: బౌద్ద దేవాలయాలు, చెర్రీ చెట్లకు, హైటెక్ నగరాలకు ఈ దేశం ప్రసిద్ది. ఇక్కడ మన రూపాయి విలువ 16.49 దక్షిణ కొరియా వోన్‌తో సమానం.