శీతాకాలంలో ఆరోగ్యానికి బెస్ట్ మెడిసిన్ నడక.. నడకలో ఎన్ని రకాలు.. ఏ ఆరోగ్య సమస్యకు ఏ నడక మంచిదో తెలుసా..

Updated on: Nov 29, 2024 | 12:31 PM

రోజూ నడవడం ఆరోగ్యాన్ని కాపాడే మంచి మెడిసిన్. రోజూ నడవం వలన బరువు అదుపులో ఉండడమే కాదుగుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. మనం రోజూ ఎలా నడవాలో తెలుసుకోవడం కూడా ముఖ్యం. కొన్ని రకాల నడకల గురించి చెప్పుకుందాం. వీటిలో మీకు ఏది మంచిదో కూడా తెలుసుకోండి.

1 / 7
బరువు తగ్గడానికి లేదా ఫిట్‌గా ఉండటానికి అనేక పద్ధతులను ప్రయత్నిస్తున్నారు. రకరకాల డైట్స్ ని పాటిస్తున్నారు. అదే సమయంలో శారీరకంగా దృఢంగా కనిపించేందుకు వ్యాయామాలు, యోగ , జిమ్ కి వెళ్ళడం వంటి  కూడా చేస్తారు. ప్రతి ఒక్కరూ వర్కవుట్ లేదా వ్యాయామం చేయాల్సిన అవసరం లేనప్పటికీ.. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రోజూ నడవ వచ్చు. తక్కువ శ్రమతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది ఉత్తమ మార్గం.

2 / 7
నడకలో అనేక రకాలు ఉన్నాయని.. అవి వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని మీకు తెలుసా. ఎలాంటి వాకింగ్ చేయాలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ రోజు మనం కొన్ని రకాల నడకల గురించి తెలుసుకుందాం.. ఫిట్‌నెస్ లక్ష్యాన్ని సాధించడానికి ఏ పద్ధతిలో నడకను ప్రయత్నించవచ్చో తెలుసుకుందాం..

3 / 7
చురుకైన నడక: అంటే సాధారణం కంటే వేగంగా నడవాలి. అయితే రన్నింగ్ లేదా జాగింగ్ చేయవలసిన అవసరం లేదు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు..  వారానికి 5 సార్లు ఇటువంటి నడకను  దినచర్యను అనుసరిస్తే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ తగ్గడం ప్రారంభిస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. సరళంగా చెప్పాలంటే చురుకైన నడక గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సమస్యలు ఉన్నవారు నిపుణుల సలహా మేరకు నడక ప్రారంభించాలి.

4 / 7
Walking

Walking

5 / 7
ట్రయల్ రన్నింగ్‌: ఈ రకమైన నడక శరీర సమతుల్యతను, సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఈ నడక హైకింగ్ అనుభూతిని ఇస్తుంది. ఇది గుండె, ఇతర ముఖ్య అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇలా నడవం వలన శరీరంలోని కీళ్లు దృఢంగా మారుతాయి. ప్రతిరోజూ ఒకటి నుంచి రెండు కిలోమీటర్లు ట్రయల్ వాకింగ్ చేయండి.

6 / 7
Walking

Walking

7 / 7
ఇంటర్వెల్ వాకింగ్: ఈ రకమైన నడకలో మీరు మధ్య మధ్యలో ఇంటర్వెల్ వాకింగ్ తీసుకోవాలి. మొదట్లో కొన్ని నిమిషాల పాటు ఫాస్ట్ వాక్ చేసిన తర్వాత 30 సెకన్ల నుంచి ఒకటి లేదా రెండు నిమిషాల వరకు విరామం తీసుకోవాలి. దీని తరువాత కొంత సమయం పాటు వేగంగా నడవాలి. ఇలా చేయడం వల్ల మన శరీరం అలసిపోయి త్వరగా కోలుకుంటుంది. ఈ రకమైన నడక బరువు తగ్గడం నుంచి ఫిట్‌నెస్ పొందడం వరకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు ఇంటర్వెల్ వాకింగ్ చేయండి.