
శీతాకాలంలో పొడి వాతావరణం జుట్టును పొడిగా మారుతుంది. అలాగే, కాలుష్యం జుట్టు ఆరోగ్యాన్ని మరింత క్షీణింపచేస్తుంది. ఈకాలంలో జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. జుట్టు రాలడం, జిడ్డు స్కాల్ప్ సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో వచ్చే అతి పెద్ద సమస్య చుండ్రు.

చలికాలంలో చుండ్రు అంత తేలికగా వదలదు. దానితో స్కాల్ప్ దురద పెరుగుతుంది. వెంట్రుకలు, శిరోజాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. చుండ్రు సమస్యను నివారించాలంటే ఈ చిట్కాలు పాటించండి

కొబ్బరి నూనెను మీ జుట్టుకు క్రమం తప్పకుండా పట్టించాలి. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే చుండ్రు పోతుంది. కొబ్బరి నూనెను ఉపయోగించే ముందు కొద్దిగా వేడి చేసుకుని గోరువెచ్చగా అప్లై చేసుకోవాలి. చర్మం పొడిబారడం, ఇన్ఫెక్షన్ వల్ల చుండ్రు సమస్యలు తలెత్తుతాయి. చండ్రు నివారణకు టీ ట్రీ ఆయిల్ కూడా ఉపయోగపడుతుంది. బాదం నూనెతో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించాలి.

టీ ట్రీ ఆయిల్‌కు బదులుగా వేపను కూడా ఉపయోగించవచ్చు. కలబంద జెల్‌తో వేప ఆకుల పొడి లేదా వేప ఆకుల పేస్ట్ మిక్స్ చేసి తలకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరి. యాంటీ డాండ్రఫ్ షాంపూని కూడా ఉపయోగించవచ్చు.

తలకు ఆపిల్ సైడర్ వెనిగర్ అప్లై చేయవచ్చు. ఇది స్కాల్ప్ pH స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. నానబెట్టిన మెంతి గింజలను యాపిల్ సైడర్ వెనిగర్‌లో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చెయ్యాలి.