కాల్షియం అద్భుతమైన మూలం పాలు. అంతేకాదు అనేక పోషకాలు పాలల్లో సమృద్ధిగా ఉన్నాయి. ఒక పెద్ద కప్పు అంటే దాదాపు 250 గ్రాముల పాలలో రోజువారీ అవసరాల్లో 88 శాతం నీరు, 8.14 గ్రాముల ప్రోటీన్, 12 గ్రాముల చక్కెర, 12 గ్రాముల పిండి పదార్థాలు, 8 గ్రాముల కొవ్వు, విటమిన్ B12, B2, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. కనుక శీతాకాలంలో పాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు.