
రోజంతా గజిబిజిగా గడిపిన తర్వాత కనీసం రాత్రి పూటైనా కంటి నిండా నిద్రపోవాలని అనుకుంటారు. అందుకోసం చాలా మంది వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇందులో పడుకునే ముందు సాక్స్ ధరించి నిద్రపోవడం ఒకటి.

ముఖ్యంగా చలికాలంలో చాలా మంది సాక్స్ వేసుకుని నిద్రపోతారు. పాదాలకు చల్లదనం రాకుండా ఉండటానికి ఇది ఒక సాధారణ పద్ధతి. కానీ సాక్స్ వేసుకుని నిద్రపోవడం నిజంగా సరైనదా కాదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

సాక్స్ ధరించి నిద్రపోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. సాక్స్ ధరించడం వల్ల పాదాలు చెమట పట్టవచ్చు. దీనివల్ల పాదాల నుంచి దుర్వాసన వస్తుంది.

రాత్రంతా పాదాలకు సాక్స్ ధరించడం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. పాదాలపై దద్దుర్లు కూడా వస్తాయి. బిగుతుగా సాక్స్ వేసుకుని నిద్రించడానికి ప్రయత్నిస్తే, మీ పాదాలలో రక్త ప్రసరణ కూడా దెబ్బతింటుంది.

అందుకే వీలైతే రాత్రిపూట సాక్స్ ధరించకుండా ఉండటం మంచిది. అయితే మీకు చాలా చలిగా అనిపిస్తే నిపుణుల సలహా మేరకు సాక్స్ జాగ్రత్తగా ధరించాలి.