పిల్లలకు టీ, కాఫీ ఇస్తే ఏమవుతుంది..? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..

Updated on: Dec 30, 2025 | 7:40 PM

చాలామంది ఇళ్లలో పెద్దలు టీ లేదా కాఫీ తాగేటప్పుడు పక్కనే ఉన్న పిల్లలకు కూడా ఒక చిన్న కప్పులో అలవాటు చేస్తుంటారు. మరికొందరు పిల్లలు మారాం చేస్తున్నారని పాలలో టీ కలిపి ఇస్తుంటారు. అయితే ఈ చిన్న అలవాటు పిల్లల ఎదుగుదలపై పెను ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పదేళ్లలోపు పిల్లలకు కెఫీన్ కలిగిన పానీయాలు ఇవ్వడం వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు ఇవే..

1 / 5
రక్తహీనతకు ప్రధాన కారణం: పిల్లల ఎదుగుదల దశలో ఐరన్ చాలా అవసరం. టీ, కాఫీలలో ఉండే రసాయనాలు శరీరం ఆహారం నుండి ఐరన్ గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల పిల్లలు ఎంత పోషకాహారం తిన్నా ఉపయోగం ఉండదు. ఫలితంగా వారు రక్తహీనత, బారిన పడి, నీరసంగా మరియు సన్నగా మారుతుంటారు.

2 / 5
మెదడుపై కెఫీన్ ప్రభావం: పెద్దలకు ఉత్సాహాన్నిచ్చే కెఫీన్, పిల్లల సున్నితమైన నాడీ వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరు. కెఫీన్ వల్ల పిల్లలు ఆందోళన చెందడం, అతిగా కోపం ప్రదర్శించడం వంటివి చేస్తారు. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదల కుంటుపడుతుంది.

3 / 5
ఆకలిని చంపేస్తాయి: ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల ఆకలిని ప్రేరేపించే హార్మోన్లు అణిచివేయబడతాయి. దీనివల్ల పిల్లలకు తిండిపై ఆసక్తి తగ్గుతుంది. అంతేకాకుండా, కడుపులో ఆమ్లత్వం పెరిగి మలబద్ధకం, గుండెల్లో మంట వంటి జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.

4 / 5
చక్కెరతో ముప్పు: టీ, కాఫీలలో ఉండే అధిక చక్కెర వల్ల పిల్లల్లో చిన్న వయసులోనే ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే దంతక్షయం సమస్య సర్వసాధారణం అవుతుంది. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లలు అదుపులేకుండా హైపర్ యాక్టివ్‌గా మారుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.

5 / 5
పిల్లలకు టీ, కాఫీలకు బదులుగా పాలు, రాగి జావ లేదా తాజా పండ్ల రసాలను ఇవ్వడం అలవాటు చేయండి. ఆరోగ్యం కంటే రుచి ముఖ్యం కాదని గుర్తుంచుకోండి. నేటి మీ చిన్న అశ్రద్ధ, రేపు వారి ఆరోగ్యానికి శాపంగా మారవచ్చు.