
భారతదేశంలోనే అత్యంత సాహసోపేతమైన ప్రదేశం ఇది. ఇక్కడ నేలపై దూకినప్పుడు పాదాల కింద నేల కదులుతుంది. ఈ రహస్య ప్రదేశం చూసేందుకు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి తరలివస్తుంటారు. అదే మినీ సిమ్లాగా పిలిచే ఛత్తీస్‌గఢ్‌లోని మైన్‌పత్. నిజానికి ఛత్తీస్‌గఢ్ అనేక రహస్య ప్రదేశాలకు నిలయం. వాటి రహస్యాలు ఇప్పటికీ అంతుచిక్కకుండానే ఉన్నాయి.

పచ్చని ప్రకృతి దృశ్యాలు, దేవాలయాలు, కోటలు మొదలుకొని అనేక అద్భుతమైన దృశ్యాల వరకు ఇక్కడ చూడటానికి చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందుకే ఇది ఏడాది పొడవునా పర్యాటకులతో కిక్కిరిసి ఉంటుంది. వాటిల్లో ఒకటి ఛత్తీస్‌గఢ్‌లోని మినీ సిమ్లాగా పిలిచే మైన్‌పత్.

సహజ సౌందర్యంతో పర్యాటకులను ఆకర్షించే ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 3300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశం చల్లని వాతావరణానికి, పచ్చదనానికి ప్రసిద్ధి చెందింది. మైన్‌పత్‌లోని అత్యంత రహస్యమైన ప్రదేశం జల్జలి. ఈ ప్రదేశం అత్యంత విశేషమైన లక్షణం ఏమిటంటే ఇక్కడి నేల అస్థిరంగా ఉంటుంది. అంటే ఎవరైనా దానిపై నడిచినా లేదా దూకినా ఆ నేల స్పాంజిలాగా, పరుపులాగా కదలడం మొదలవుతుంది.

దీని వెనుక ఉన్న రహస్యం చేదించేందుకు పరిశోధకులు యేళ్ల తరబడి అధ్యయనం చేస్తున్నారు. అయినప్పటికీ ఈ రహస్యాన్ని ఇంతవరకు ఎవరూ ఛేదించలేకపోయారు. ఈ రహస్య జల్జలి ప్రదేశం శాస్త్రవేత్తలకు, సాధారణ ప్రజలకు కూడా ఒక ఆసక్తి కేంద్రంగా మార్చింది.

దీంతో ఈ ప్రదేశం పర్యాటకులకు పెద్ద ఆకర్షణగా మారింది. ఈ ఘటనకు గల కచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇది కాకుండా అక్కడ అనేక ఇతర పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో టిబెటన్ వాసులు కూడా ఉన్నారు.

జల్జలితో పాటు మైన్‌పట్‌లో ఉల్టా పానీ, మచ్లీ పాయింట్, టైగర్ పాయింట్, మెహతా పాయింట్ వంటి అనేక ఇతర పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. శీతాకాలంలో (నవంబర్ నుంచి జనవరి వరకు) ఇక్కడ అధిక సంఖ్యలో పర్యాటకులు సందడి చేస్తుంటారు.

సముద్ర మట్టానికి సుమారు 3,300 అడుగుల ఎత్తులో ఉన్న మైన్‌పట్‌లో ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం, సహజ సౌందర్యంతో ఆకర్షిస్తుంది. ఇక్కడి పచ్చని ప్రకృతి, జలపాతాలు ఎంత మనోహరంగా ఉంటాయంటే వాటి అందానికి ఎవరైనా మంత్రముగ్ధులవుతారు.