తెల్ల జుట్టు వెనక ఇంత సైకాలజీ దాగుందా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Updated on: Jun 25, 2026 | 7:46 PM

దశాబ్దాలుగా తెల్ల జుట్టును ముసలితనానికి సంకేతంగా, దాచుకోవాల్సిన ఒక లోపంగా సమాజం చూస్తూ వస్తోంది. అందుకే హెయిర్ డ్రైలు, రంగుల పరిశ్రమ కోట్లలో వ్యాపారం చేస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఆర్టిఫిషియల్ రంగులకు స్వస్తి చెప్పి, తమ సహజమైన తెల్ల జుట్టును గర్వంగా ప్రదర్శిస్తున్నారు. దీనిని చూసి కొందరు అందంపై శ్రద్ధ తగ్గింది అనుకోవచ్చు. కానీ, దీని వెనుక బలమైన మానసిక కారణాలు, వ్యక్తిత్వ మార్పులు ఉన్నాయని సైకాలజీ చెబుతోంది.

1 / 5
సైకాలజిస్టులు ఎడ్వర్డ్ డెసి, రిచర్డ్ ర్యాన్ ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం.. మనుషులు ఇతరుల ఒత్తిడితో కాకుండా సొంత నిర్ణయాలతో బతికినప్పుడే ఎక్కువ సంతోషంగా ఉంటారు. నలుగురూ ఏమనుకుంటారు? అనే ఆలోచన నుంచి బయటపడి ‘‘నాకు ఏది కంఫర్ట్‌గా ఉంది?’’ అని ఆలోచించడమే స్వయం ప్రతిపత్తి. తెల్ల జుట్టును అలాగే ఉంచేయడం అనేది ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛా నిర్ణయానికి నిదర్శనం.

2 / 5
రెండు ముఖాలు వద్దు: ప్రముఖ సైకాలజిస్ట్ కార్ల్ రోజర్స్ ప్రకారం.. మన లోపలి ఆలోచనలు, బయటి రూపం ఒకేలా ఉన్నప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుంది. వయసు దాచడానికి నిరంతరం రంగులు వేస్తూ, యంగ్‌గా కనిపించడానికి ప్రయత్నించడం వల్ల ఒకానొక దశలో మానసిక అలసట వస్తుంది. తెల్ల జుట్టును అంగీకరించినప్పుడు ఆ ఒత్తిడి తగ్గి, తమను తాము ఉన్నదున్నట్లుగా చూసుకునే ధైర్యం వస్తుంది.

3 / 5
మారుతున్న ప్రాధాన్యతలు: వయసు పెరుగుతున్న కొద్దీ మనుషుల ప్రాధాన్యతలు మారతాయని లావురా కార్‌స్టెన్సన్ అనే సైకాలజిస్ట్ చెబుతున్నారు. ఇతరుల మెప్పు కోసం ఆరాటపడటం కంటే జీవితంలో నిజమైన సంతోషాన్నిచ్చే వాటిపైనే పెద్దలు దృష్టి పెడతారు. సమయం, శ్రమ ఎంతో విలువైనవిగా భావిస్తారు. అందుకే గంటల తరబడి జుట్టుకు రంగులు వేసే ప్రక్రియను వృథాగా భావించి, సహజత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇది తిరుగుబాటు కాదు, కేవలం ప్రయారిటీ మార్చుకోవడం మాత్రమే.

4 / 5
మారుతున్న ట్రెండ్: లియోన్ ఫెస్టింగర్ సిద్ధాంతం ప్రకారం.. మనుషులు తమను తాము ఇతరులతో పోల్చుకుంటారు. సోషల్ మీడియాలో కనిపించే ఫిల్టర్ చేసిన ఫోటోలు, సెలబ్రిటీల లుక్స్ చూసి వయసు దాచాలనే ఒత్తిడి పెరుగుతుంది. అయితే, ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. కార్పొరేట్ ఉద్యోగుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది పబ్లిక్‌గా గ్రే హెయిర్‌తో కనిపిస్తూ, తెల్ల జుట్టును ఒక నయా ఫ్యాషన్‌గా, నార్మల్ విషయంగా మారుస్తున్నారు.

5 / 5
అసలైన ఆనందం: రీసెర్చ్ ప్రకారం.. మన నిజాయితీ మనల్ని జీవితంలో ఎక్కువ సంతృప్తిగా ఉంచుతుంది. ఇక్కడ జుట్టుకు రంగు వేసుకోవడం తప్పని కాదు. అది మీ స్వంత ఇష్టమైతే తప్పులేదు. కానీ సమాజానికి భయపడి ఆ పని చేస్తుంటేనే సమస్య. నేను నా ఇష్టంతో చేస్తున్నానా? లేక సమాజం కోసం చేస్తున్నానా? అనే స్పష్టత ముఖ్యం. తెల్ల జుట్టును అంగీకరించిన వారు ముసలివారిగా మారిపోయినట్లు ఫీల్ అవ్వరు. పైగా వారు మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఎందుకంటే, మార్పును ఎదిరించడం కంటే, మార్పును హుందాగా స్వీకరించడమే అసలైన కాన్ఫిడెన్స్.

Follow Us