Tamarind: వంటల్లో అధికంగా చింతపండు వాడుతున్నారా? ఈ విషయం తెలుసుకోండి..

| Edited By: Ravi Kiran

Oct 10, 2024 | 10:00 PM

కొన్ని వంటలకు చింతపండు లేకుంటే రుచి బాగోదు. మన వంటలలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చింతపండును రకరకాల వంటల్లో ఉపయోగిస్తుంటారు. చింతపండు రుచి పుల్లగా ఉంటుంది. అందుకే పేరు చెప్పగానే నోటి నుంచి లాలాజలం కారుతుంది. అందుకే పలు రకాల వంటల్లో చింతపడు లేకుండే అసంపూర్ణంగా అనిపిస్తుంది..

1 / 5
కొన్ని వంటలకు చింతపండు లేకుంటే రుచి బాగోదు. మన వంటలలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చింతపండును రకరకాల వంటల్లో ఉపయోగిస్తుంటారు. చింతపండు రుచి పుల్లగా ఉంటుంది. అందుకే పేరు చెప్పగానే నోటి నుంచి లాలాజలం కారుతుంది. అందుకే పలు రకాల వంటల్లో చింతపడు లేకుండే అసంపూర్ణంగా అనిపిస్తుంది.

2 / 5
చింతపండులోలో టార్టారిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సక్సినిక్ యాసిడ్, పెక్టిన్, టానిన్లు, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్లు ఉంటాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు 10 గ్రాముల చింతపండు తీసుకోవడం సురక్షితం. ఇంతకన్నా తక్కువ పరిమాణంలో తీసుకున్నా మంచిదే. చింతపండు ఎక్కువగా తీసుకుంటే అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

3 / 5
చింతపండు ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల నిర్మాణం దెబ్బతింటుంది. పళ్లపై ఉండే ఎనామెల్ దెబ్బతింటుంది. దంతాలు కూడా బలహీనంగా మారవచ్చు. చింతపండులో టానిన్‌లతో సహా అనేక సమ్మేళనాలు ఉంటాయి. వీటిని జీర్ణం చేసుకోవడం కొంచెం కష్టం. అధిక పరిమాణంలో చింతపండు తీసుకుంటే, కడుపు, జీర్ణశయాంతర ప్రేగులలో యాసిడ్ స్థాయిని పెంచుతుంది. ఇది గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్, ఇతర కడుపు సమస్యలను కలిగిస్తుంది.

4 / 5
చింతపండును అధిక మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. మైకం, బలహీనత ఆవహిస్తాయి. గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి ఇప్పటికే మందులు వాడుతున్న వారు చింతపండు తీసుకోవడం అంతమంచిది కాదు.

5 / 5
గర్భధారణ సమయంలో చింతపండుకు దూరంగా ఉండటం మంచిది. చింతపండు తీసుకోవడం గర్భిణీ స్త్రీలకు అంత మంచిది కాదు. ఎందుకంటే దీన్ని ఎక్కువగా తింటే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది కడుపులో పెరుగుతున్న శిశువుపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు పాలిచ్చే తల్లులు కూడా చింతపండు తినకూడదు.