
ఇది వరకు రోజుల్ల అమ్మమ్మలు ఇంట్లోనే చేసి పిల్లలకు, పెద్దలకు పెట్టే వాళ్ళు ఎందుకంటే, ఇది ఆరోగ్యకరమైన స్వీట్ కావాల్సిన పోషకాలు ఇచ్చే వాటిలో ఈ తెల్ల నువ్వుల లడ్డు ఒకటి. దీనిలో బెల్లం, మంచి వాసన వచ్చే నువ్వులు కలిస్తే ఆ రుచిని ఎవరికీ చెప్పలేము. పండుగల సమయంలోనే కాకుండా అన్ని సీజన్స్ లో దీనిని తినొచ్చు.

తెల్ల నువ్వుల లడ్డుకు కావలసిన పదార్థాలు: మూడు కప్పులు తెల్ల నువ్వులు , కప్పున్నర బెల్లం తురుము, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి , ఒక టేబుల్ స్పూన్స్ యాలకుల పొడి , 10 జీడిపప్పులు, 10 బాదంపప్పులు, పావు కప్పు ఎండు కొబ్బరి తురుమును తీసుకోవాలి. వీటితో చేస్తే రుచికరంగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి

తెల్ల నువ్వుల లడ్డు తయారీ విధానం స్టెప్ 1: ముందుగా మీరు తెల్ల నువ్వులను తీసుకుని వాటిని బాగా కడిగి ఒక పాన్ తీసుకుని మీడియం మంటపై వీటిని బాగా వేయించాలి. ఈ నువ్వులు బాగా వేగితే మంచి వాసన వచ్చినప్పుడు కిందకు దించేయాలి. ఈ నువ్వులు బాగా చల్లారిన తర్వాత మిక్సీకి కూడా మెత్తగా కాకుండా పొడిలా చేసుకోవాలి

తెల్ల నువ్వుల లడ్డు తయారీ విధానం స్టెప్ 2: ఇలా పొడి చేస్తే ఈ లడ్డూలు తియ్య తియ్యగా ఉంటాయి. ఇంకా అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ దానిలో 10 జీడిపప్పు, 10 బాదంపప్పును గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక పాత్రలో కప్పున్నర బెల్లం తురుము వేసి కొద్దిగా నీరు పోసి బాగా కరిగించాలి. బెల్లం మొత్తం కరిగిన తరవాత దీనిని శుద్ధి చేయాలి.

తెల్ల నువ్వుల లడ్డు తయారీ విధానం స్టెప్ 3 : ఈ బెల్లం పాకంలో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కలపాలి. ఆ తర్వాత నువ్వుల పొడి, జీడిపప్పు, బాదంపప్పు, కొబ్బరి వేసి బాగా కలపాలి ఇది వేడి మీద ఉన్నప్పుడే రెండు చేతులకు కొద్దిగా నూనె రాసుకుని లడ్డూలుగా చేసుకోవాలి. ఈ లడ్డూలను ఫ్యాన్ కింద ఆరబెడితే గట్టిగా అవుతాయి.